బ్యాంకాక్ నుంచి వస్తూ తేడాగా కనిపించిన ఇద్దరు ప్రయాణికులు.. ఆపి చెక్ చేయగా..

బ్యాంకాక్ నుంచి వస్తూ తేడాగా కనిపించిన ఇద్దరు ప్రయాణికులు.. ఆపి చెక్ చేయగా..


అక్రమ రవాణాను అరికట్టేందుకు అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. స్మగ్లర్లు రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా.. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి.. ఇద్దరు ప్రయాణికులు గుట్టుచప్పుడు కాకుండా.. కోట్లాది రూపాయల హైడ్రోపోనిక్ గంజాయిని రవాణా చేస్తుండగా.. అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాల ప్రకారం.. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (CSMI)లోని కస్టమ్స్ అధికారులు బహుళ ఆపరేషన్లు నిర్వహించి, రూ.21 కోట్లకు పైగా విలువైన మాదకద్రవ్యాలు, విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.

ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు.. అధికారులు ఇద్దరు బ్యాంకాక్ ప్రయాణికుల నుండి INR 20.06 కోట్ల విలువైన 21 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.. వారిద్దరినీ NDPS చట్టం కింద అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరో కేసులో, బ్యాంకాక్‌కు వెళ్తున్న ఒక ప్రయాణికుడి నుంచి రూ.26.37 లక్షల విలువైన విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా.. రూ.49.22 లక్షల విలువైన విదేశీ కరెన్సీని తీసుకెళ్తున్న మరో ప్రయాణికుడిని కూడా కస్టమ్స్ అడ్డుకుంది. తదుపరి తనిఖీలలో రూ.38.10 లక్షల విలువైన బంగారు ధూళిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

కాగా.. ముంబై విమానాశ్రయంలో పెద్ద ఎత్తున హైడ్రోపోనిక్ గంజాయి, విదేశీ కరెన్సీ, బంగారు ధూళి స్వాధీనం చేసుకోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వీరి వెనుక ఉన్న ముఠా కోసం విచారణను వేగవంతం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *