తెలుగులోనూ బాగా ఫేమస్. ఛైల్డ్ ఆర్టిస్ట్‌గానే మస్త్ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఆ తర్వాత హీరోయిన్గా కూడా కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టింది. తెలుగు సినిమాతోనే కథానాయికగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈముద్దుగుమ్మ తన అందం, అభినయంతో క్రేజీయెస్ట్ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇటు తెలుగు, అటు తమిళ్లో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఈ అందానికి ముగ్ధులైన అభిమానులు ఏకంగా గుడి కట్టేశారంటే ఈ ముద్దుగుమ్మకు ఉన్న క్రేజ్ ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. యాపిల్ బ్యూటీగా ఫ్యాన్స్ మదిలో ముద్ర వేసుకున్న ఈ అందాల తార తన బెస్ట్ ఫ్రెండ్ భర్తనే వలలో వేసుకుంది. అతన్నే పెళ్లి చేసుకుంది. పెళ్లైన తర్వాత సినిమాల స్పీడ్ తగ్గించింది. కానీ గ్లామర్ లో మాత్రం తగ్గేదే లే అంటుంది. ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా మరి?
చేసింది ఒకే ఒక్క సినిమా.. అందాలతో గత్తరలేపింది.. దెబ్బకు కనించకుండాపోయింది
ఆమె మరెవరో కాదు.. దేశముదురు హీరోయిన్ హన్సిక. ఈ సినిమా చేస్తున్న సమయంలో హన్సిక వయసు కేవలం 15ఏళ్లు మాత్రమే.. హన్సిక చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించింది. దేశముదురు సినిమా తర్వాత కంత్రి,బిల్లా, మస్కా, కందిరీగ, పవర్, తెనాలి రామకృష్ణ బిఏ.బిఎల్, మై నేమ్ ఈజ్ శృతి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఈ చిన్నది తెలుగులో సినిమాలు తగ్గించింది. ఎక్కువగా తమిళ్ హిందీ బాషల పైనే ఫోకస్ చేస్తుంది.
ఇవి కూడా చదవండి
ఇదేందయ్యా..! అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..!! మరీ ఇంత అందంగా ఎలా మారిపోయింది ఈ అమ్మడు
కాగా హన్సిక మోత్వానీ వివాహం 2022 డిసెంబర్ 4న వ్యాపారవేత్త సొహైల్ కతూరియాతో రాజస్థాన్ జైపూర్‌లో వివాహం జరిగింది. సొహైల్ కు ఇది రెండో పెళ్లి. అతని మొదటి భార్య రింకీ బజాజ్ హన్సికకు బెస్ట్ ఫ్రెండ్. వీరి పెళ్లిలో హన్సిక కూడా హాజరై, సంగీత్‌లో డాన్స్ చేసిన వీడియోలు, ఫోటోలు గతంలో వైరల్ అయ్యాయి. హన్సికే వారి వివాహాన్ని ‘బ్రేక్’ చేసి సోహైల్‌ని ‘స్టీల్’ చేసుకుందని అంటూ ట్రోలింగ్, విమర్శలు వచ్చాయి. దీని పై గతంలో హన్సిక మాట్లాడుతూ.. ఇదంతా ‘మీడియా-రాసిన నరేటివ్’ అని అన్నారు. రింకీతో తమకు ఎలాంటి ఫ్రెండ్షిప్ లేదు అని తెలిపింది.
ఇద్దరితో పెళ్లి.. మరో ఇద్దరితో ప్రేమాయణం.. మా అమ్మ చేసిందాంట్లో తప్పేంటంటున్న కొడుకు
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.