అలా ఇంట్లో బెడ్‌పైన పడుకుందామని వెళ్లిన వ్యక్తికి దుప్పటిలో ఉన్న పామును చూసి వణుకు పుట్టింది. దెబ్బకు అక్కడినుంచి బయటకు పరుగులు తీశాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి పడుకోవడానికి తన రూమ్‌లో మంచం వద్దకు వెళ్లాడు. బెడ్‌పైన ఉన్న బెడ్‌షీట్‌లో ఏదో కదులుతున్నట్టు అతనికి అనుమానం వచ్చింది. మెల్లగా దుప్పటిని పైకి లేపాడు. హలో నేనున్నానిక్కడ అన్నట్టుగా పాము మెల్లగా పాకుతూ తల బయటకు పెట్టి చూస్తుంది. పామును చూసి అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఆ సమయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అది కాటు వేసేది. ముందే గమనించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. చలికాలంలో ఇలాంటి దృశ్యాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. పాములు ఇళ్లలో చేరి మంచాల కింద, గ్యాస్ సిలిండర్లు, ఫ్రిడ్జ్‌లు, కూలర్ల మాటున తిష్టవేస్తుంటాయి. ఇప్పుడు దుప్పట్లో కనిపించిన పాము వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియోను దాదాపు 90 వేలమంది వీక్షించగా 2 వేలమంది లైక్ చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇళ్లకు తలుపులే లేని గ్రామం.. మరి దొంగలు పడితే..?
వామ్మో… వచ్చే ఏడాది అలా జరగబోతుందా? బాంబు పేల్చిన బాబా వంగా!