బస్తీమే సవాల్.. త్రిశూల వ్యూహంతో హీటెక్కిన పాలిటిక్స్.. అన్ని పార్టీల చూపూ ఆ చౌరస్తా వైపే..

బస్తీమే సవాల్.. త్రిశూల వ్యూహంతో హీటెక్కిన పాలిటిక్స్.. అన్ని పార్టీల చూపూ ఆ చౌరస్తా వైపే..


ఆల్ రూట్స్ లీడ్స్ టు జూబ్లీ హిల్స్. అన్ని పార్టీల చూపూ ఆ చౌరస్తా వైపే. మాగంటి మరణంతో ఖాళీ ఐన జూబ్లీహిల్స్‌ సీటు కోసం మూడు పార్టీలూ యమా సీరియస్‌గా కసరత్తు షురూ చేశాయ్. కాంగ్రెస్ పార్టీ తరఫున ముగ్గురు మంత్రులు రంగంలోకి దిగి, బస్తీల్లో కాళ్లరిగేలా తిరుగుతూ, క్షేత్రస్థాయిలో క్యాడర్‌ని యాక్టివేట్ చేస్తున్నారు.

కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

అటు, బీఆర్‌ఎస్, బీజేపీ టాప్ లీడర్‌షిప్ మొత్తం జూబ్లీహిల్స్‌ మీదే ఫోకస్ చేసింది. బూత్ లెవల్ కమిటీలను ఏర్పాటు చేసుకొని చాపకింద నీరులా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో క్యాంపెయినింగ్ మొదలుపెట్టింది బీజేపీ. ఇంటింటికీ తిరిగి, ప్రతీ ఓటరునూ టచ్ చేస్తోంది. ఎంఐఎం అండ చూసుకుని వాళ్లు విర్రవీగితే, మేం మాత్రం ప్రజాబలాన్నే నమ్ముకున్నామని.. కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

తెలంగాణలో అధికారంలోకి రాబోయేది తామేనని, ఆ దిశగా మొదటి అడుగు జూబ్లీహిల్స్‌ విజయంతోనే పడుతుందని బలంగా విశ్వసిస్తోంది బీజేపీ. ఇందుకోసం హిందూ కార్డ్‌నే గట్టిగా నమ్ముకున్నట్టుంది. కానీ, అర్బన్ ఓటర్, ముఖ్యంగా హైదరాబాద్ ఓటరు తమవైపే ఉన్నాడన్నది బీఆర్‌ఎస్ ధీమా.

కేటీఆర్ ఏమన్నారంటే..

షేక్‌పేట్‌లో ప్రచారం సందర్భంగా స్థానిక ముస్లిం నేతలతో సమావేశమైన కేటీఆర్, జూబ్లీహిల్స్‌లో తిరిగే మంత్రులంతా టూరిస్టులేనన్నారు. ఎన్నికలయ్యాక పత్తా ఉండరని, మాగంటి సునీత గెలుపు ఖాయమైందని స్టేట్‌మెంట్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం అభివృద్ధి పనులతో జూబ్లీహిల్స్ బస్తీవాసుల్ని ఫిదా చేసే పన్లో ఉంది. లేటుగా వచ్చినా లేటెస్ట్‌గా వస్తామంటూ అభ్యర్థి ఎంపికపై సీరియస్‌గా కసరత్తు చేస్తోంది హస్తం పార్టీ.

అటు, బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలతో పాటు 8 రాష్ట్రాల్లో జరిగే ఉపఎన్నికలకు 470 మంది పరిశీలకుల్ని నియమించింది ఈసీ. అందులో భాగంగా జూబ్లీహిల్స్ కోసం అధికారులు రంగంలో దిగారు. అతిత్వరలో బైపోల్ తేదీలు ఖరారయ్యే అవకాశముంది. సో, జూబ్లీ హిల్స్‌ మే సవాల్.. కమింగ్‌ సూన్ అన్నమాట..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *