పెత్తరామాస రోజు పేర్చే బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మ అంటారు. భాద్రపద అమావాస్య రోజున పేర్చే ఎంగిలిపూల బతుకమ్మతో బతుకమ్మ పండుగ మొదలు అవుతుంది. ఈ రోజు అమ్మవారికి తులసి ఆకులు, వక్కలు నైవేద్యం సమర్పిస్తారు, రెండో రోజు అటుకుల బతకమ్మ, ఈ అమ్మ వారికి చప్పిడి పప్పు, బెల్లం, అటుకులు నైవేద్యంగా సమర్పిస్తారు.