బంపర్ ఆఫర్ కొట్టిన మెకానిక్..రాత్రికి రాత్రే కోటీశ్వరుడు !!

బంపర్ ఆఫర్ కొట్టిన మెకానిక్..రాత్రికి రాత్రే కోటీశ్వరుడు !!


అదృష్టం ఎప్పుడు ఏ రూపంలో ఎవరి తలుపు తడుతుందో ఎవరూ చెప్పలేరు. ఈ మాట పంజాబ్‌కు చెందిన మహేంద్రసింగ్‌ విషయంలో అక్షరాలా నిజమైంది. నిన్నటి వరకు మొండిగా ఉన్న స్టవ్‌లకు రిపేర్లు చేస్తూ, రోజువారీ కూలీతో బతుకు బండి లాగించిన అతని ఇంట్లో అదృష్టం స్టవ్‌ వెలిగించింది. స్టవ్‌లు రిపేర్లు చేసిన ఆ చేతుల్లోకి.. ఇప్పుడు ఏకంగా రూ.3 కోట్ల జాక్‌పాట్ వచ్చి చేరింది! జీవనోపాధి కోసం స్టవ్ మెకానిక్ షాపు నడిపే మహేంద్రసింగ్‌, ఇటీవల గురుగ్రామ్‌లోని ఓ ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. తిరిగి వస్తుండగా పత్రాన్ మార్కెట్‌లో ఒక లాటరీ షాపు కనిపించింది. ఏదో సరదాగా కొన్న ‘నాగాలాండ్ స్టేట్ డియర్ మహా శివరాత్రి బంపర్ 2026’ టికెట్, ఆయన జీవితాన్నే మలుపు తిప్పుతుందని ఊహించలేదు. ఫిబ్రవరి 21న జరిగిన డ్రాలో మహేంద్రసింగ్ కొన్న టికెట్‌కు మొదటి బహుమతి తగిలింది. ఒక్కసారిగా రూ. 3 కోట్లు గెలుచుకున్నారన్న వార్త తెలియగానే ఆ మెకానిక్ షాపు దగ్గర పండగ వాతావరణం నెలకొంది. మొత్తం ప్రైజ్ మనీ రూ.3 కోట్లు కాగా, ట్యాక్సులు, కమీషన్లు పోను సుమారు రూ. 1.80 కోట్లు చేతికి అందించనున్నారు లాటరీ నిర్వాహకులు. స్టవ్ మెకానిక్‌గా పనిచేస్తూ సామాన్య జీవితం గడుపుతున్న మహేంద్రసింగ్‌కు లాటరీ తగిలిందని తెలియగానే పట్టణమంతా సందడి మొదలైంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు. “భగవంతుడి దయ వల్లే ఇది సాధ్యమైంది” అంటూ మహేంద్రసింగ్ ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పరమభక్తుడు.. శఠగోపానికే శఠగోపం పెట్టాడుగా!

Thanuja Puttaswamy: ఫ్యాన్ పై విరుచుకుపడ్డ తనూజ.. సిగ్గు లేదా అంటూ..

Rashmika-Vijay Marriage: మొత్తం 3 కిలోల బంగారు ఆభరణాలు.. ‘విరోష్‌’ ఆభరణాల ప్రత్యేకత ఏంటంటే ??

కాయ్ రాజా కాయ్.. ఎంత డబ్బు లెక్క పెడితే అంత సొమ్ము మీదే.. ఉద్యోగులకు కంపెనీ బంపరాఫర్‌..

Holi: శ్మశానంలో మండుతున్న చితుల మధ్య “హోలీ’ ఎక్కడంటే..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *