ఫ్లాపుల దారి పట్టిన ముగ్గురు మొనగాళ్లు.. వారు చేస్తున్న తప్పు ఇదేనా

ఫ్లాపుల దారి పట్టిన ముగ్గురు మొనగాళ్లు.. వారు చేస్తున్న తప్పు ఇదేనా


మామూలుగా ముందు సినిమా అంచనాలు అందుకోకపోతే.. తర్వాతి సినిమాపై ఆ ఎఫెక్ట్ బలంగా ఉంటుంది. కానీ అది మిగిలిన హీరోలకు.. మన తెలుగు హీరోలకు కాదు. కావాలంటే ఓ ముగ్గురు హీరోలను చూపిస్తాం.. వాళ్ల గత సినిమా పెద్దగా ఆడకపోయినా ప్రజెంట్ వాళ్లు చేస్తున్న ప్రాజెక్ట్స్‌పై ఎక్స్‌పెక్టేషన్స్ పీక్స్‌లో ఉన్నాయి. ఇంతకీ ఆ హీరోలెవరో ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దామా..? మన స్టార్ హీరోలు.. వాళ్ళ ఇమేజ్ చూసి అప్పుడప్పుడూ మిగిలిన హీరోలకు కుళ్లు వచ్చేస్తుందేమో..? బాలీవుడ్‌లో సల్మాన్, అమీర్, అక్షయ్ లాంటి స్టార్ హీరోలకు సైతం ప్లాపుల్లో ఉండటంతో ఓపెనింగ్స్ సరిగ్గా రావట్లేదు. మన పక్కనే ఉన్న తమిళ ఇండస్ట్రీలోనూ ఇదే తంతు. కానీ తెలుగులో మాత్రం అలా కాదు.. మన స్టార్ పవర్ నెక్ట్స్ లెవల్. హిట్టు ఫ్లాపులతో పని లేదిక్కడ. కావాలంటే చూడండి.. రామ్ చరణ్ గత సినిమా గేమ్ ఛేంజర్ డిజాస్టర్.. కానీ ఆ ప్రభావం పెద్దిపై పెద్దగా పడినట్లు అయితే కనిపించట్లేదు. బిజినెస్ పరంగా చూసినా.. క్రేజ్ పరంగా చూసినా.. మార్కెట్ పరంగా లెక్కేసినా చరణ్ కెరీర్‌లోనే టాప్‌లో ఉంది పెద్ది. ఈ సినిమాతో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు మెగా వారసుడు. జూనియర్ ఎన్టీఆర్ విషయంలోనూ ఇదే జరుగుతుంది. పదేళ్ళ తర్వాత వార్ 2తో డిజాస్టర్ ఇచ్చారు తారక్. బాలీవుడ్‌కు వెళ్లి అనవసరంగా ఫ్లాప్ తెచ్చుకున్నావ్ అన్నా అంటూ ఫ్యాన్స్ కూడా నిట్టూరుస్తున్నారు. కానీ డ్రాగన్‌పై ఈ ప్రభావం పడట్లేదు. ప్రశాంత్ నీల్ సినిమా తారక్ కెరీర్‌లోనే హైయ్యస్ట్ బిజినెస్ చేస్తుంది.. అన్ని రికార్డుల్ని దాటేలా కనిపిస్తుంది.మహేష్ బాబు సైతం స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. ఈయన గత సినిమా గుంటూరు కారం యావరేజ్ దగ్గరే ఆగింది. కానీ మహేష్ నెక్ట్ ప్రాజెక్ట్ SSMB29పై ప్రపంచ వ్యాప్తంగా అంచనాలున్నాయి. ఈ సినిమాతో ఏ ఒక్క రికార్డ్ కూడా వదిలేలా కనిపించట్లేదు సూపర్ స్టార్.. పైగా రాజమౌళి తోడున్నారు కాబట్టి తగ్గేదే లేదంటున్నారు. అందుకే మన హీరోలపై ఫ్లాప్ ఎఫెక్ట్ ఉండదనేది..!

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్యాన్ ఇండియన్ దెబ్బకు తలలు పట్టుకుంటున్న హీరోయిన్స్.. ఇమేజ్ పోయి.. బ్యాగేజ్ వచ్చిందిగా

స్పైడర్‌ మ్యాన్‌‌కి గాయాలు.. ఫ్యాన్స్‌లో ఆందోళన

ఏంటి! ‘కాంతార 2’ చూసేందుకు మద్యం, మాంసం తినకుండా వెళ్లాలా? రిషబ్ షాకింగ్ ఆన్సర్

40 ఏళ్లకి తల్లి కాబోతున్న హీరోయిన్

మెగా బ్రదర్స్‌పై RGV షాకింగ్ ట్వీట్



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *