ఫ్రెంచ్ అధ్యక్షుడికి అమెరికాలో ఊహించని షాక్.. నడి రోడ్డు మీదనే నిలబెట్టిన పోలీసులు!

ఫ్రెంచ్ అధ్యక్షుడికి అమెరికాలో ఊహించని షాక్.. నడి రోడ్డు మీదనే నిలబెట్టిన పోలీసులు!


ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీకి హాజరు కావడానికి న్యూయార్క్ చేరుకున్న ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కారును అమెరికా పోలీసులు ఆపారు. యూఎస్ అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ కాన్వాయ్ కోసం ఎదురుచూస్తూ.. పోలీసులు ఈ చర్యకు పాల్పడ్డారు. దీంతో మాక్రాన్ రోడ్డుపైకి అడుగుపెట్టి ట్రాఫిక్ పోలీసు అధికారులతో మాట్లాడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వైరల్ వీడియోలో, ఒక అధికారి ట్రంప్ కాన్వాయ్‌ వస్తుందంటూ.. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో మాట్లాడుతూ రోడ్డును మూసివేసినట్లు తెలిపాడు. ఆ తర్వాత, మాక్రాన్ ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుతున్నట్లు కనిపిస్తుంది. మాక్రాన్ ఏకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు కాల్ చేసి, తన పరిస్థితిని వివరించారు. ఇందుకు సంబంధించి కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర చేశారు. అదీకాస్త వైరల్ అవుతోంది.

వీడియో చూడండి.. 

న్యూయార్క్ పోలీసులు ఆపిన వెంటనే, మాక్రాన్ ట్రంప్‌నకు ఫోన్ చేశాడు. “నేను న్యూయార్క్‌లోని వీధిలో మీ కోసం వేచి ఉండటం మీరు ఊహించలేరు” అని ట్రంప్‌తో చెప్పారు. “మీ కారణంగా ఇక్కడ ప్రతి దారి మూసివేయడం జరిగింది.” అన్నారు. ఆ తర్వాత మాక్రాన్ న్యూయార్క్ వీధుల్లో నిలబడి ఉన్న ప్రజలతో సరదా గడిపారు. వారిలో కొంతమందితో ఆయన ఫోటోలు కూడా దిగారు. అయితే, ఈ సంఘటనపై న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు.

ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో పాల్గొనడానికి ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ న్యూయార్క్ చేరుకున్నారు. ఫ్రాన్స్ ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్య దేశం. ఈసారి, ఐక్యరాజ్యసమితి సమావేశం ఉగ్రవాదం, వాతావరణ మార్పు, పాలస్తీనా, సిరియాపై దృష్టి పెడుతుంది. కాగా, ఈ సమావేశం మొదటి రోజున, అతను పాలస్తీనాను గుర్తిస్తున్నట్లు ప్రకటించారు. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తిస్తున్నట్లు ప్రకటించిన యూరప్‌లో ఫ్రాన్స్ మొదటి దేశం. UNలో శాశ్వత సభ్యులు కాబట్టి ఈ సమావేశంలో ప్రపంచం మొత్తం ఫ్రాన్స్‌పై దృష్టి సారించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *