ఫోన్‌ పోగొట్టుకోవడంతో మొదలైన ప్రేమ కథ.. 32 ఏళ్ల వయసు తేడాతో ఒక్కటైన జంట

ఫోన్‌ పోగొట్టుకోవడంతో మొదలైన ప్రేమ కథ.. 32 ఏళ్ల వయసు తేడాతో ఒక్కటైన జంట


ఆ తర్వాత వివాహం కూడా జరిగింది. అంతేకాదు ఈ జంట ఎంతో అన్యోన్యంగా జీవిస్తోంది. జపాన్‌కు చెందిన ఈ ప్రేమజంట కథ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. జపాన్‌కు చెందిన 63 ఏళ్ల అజరాషి అనే మహిళ, తన కన్న కొడుకు కన్నా ఆరేళ్లు చిన్నవాడైన 31 ఏళ్ల యువకుడిని వివాహం చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. వీరి మధ్య 32 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉన్నప్పటికీ, వారి బంధం ఎంతో దృఢంగా సాగుతోంది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం, వీరి ప్రేమకథ 2020లో టోక్యోలోని ఓ కేఫ్‌లో చాలా సాధారణంగా మొదలైంది. అక్కడ ఓ యువకుడు మర్చిపోయిన ఫోన్‌ను అజరాషి చూశారు. కాసేపటికి ఫోన్ కోసం వెతుక్కుంటూ వచ్చిన అతనికి దాన్ని తిరిగి ఇచ్చారు. ఆ తర్వాత వారం రోజులకు మరోసారి వీరిద్దరూ అనుకోకుండా ఒకే ట్రామ్‌లో ప్రయాణిస్తుండగా ఒకరినొకరు గుర్తుపట్టి, ఫోన్ నంబర్లు మార్చుకున్నారు. అయితే, ఆ యువకుడితో పరిచయం ఆమె జీవితాన్ని మార్చేసింది. రోజూ గంటల తరబడి ఫోన్‌లో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. తాను ఏ విషయం గురించి మాట్లాడినా ఎంతో ఆసక్తి కనబరుస్తాడని, తన ఇష్టాలను అతను బాగా అర్థం చేసుకుంటాడని,అది తనకు చాలా సంతోషాన్నిచ్చిందని అజరాషి తెలిపారు. నెల రోజుల డేటింగ్ తర్వాత ఒకరి అసలు వయసు మరొకరికి తెలిసింది. వీరి బంధానికి అప్పటికే పెళ్లై, పిల్లలున్న అజరాషి కొడుకు కూడా మద్దతు తెలపడంతో యువకుడి తల్లిని ఒప్పించి ఇద్దరూ వివాహం చేసుకున్నారు. ఈ జంట 2022లో తమ వివాహాన్ని రిజిస్టర్ చేసుకుని అన్యోన్యంగా జీవిస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరూ కలిసి ఒక మ్యారేజ్ ఏజెన్సీని కూడా నడుపుతున్నారు. వీరి ప్రేమకథ ప్రస్తుతం ఆన్‌లైన్‌లో చర్చనీయాంశంగా మారింది. కొందరు వీరిని ప్రశంసిస్తుండగా, మరికొందరు వయసు తేడాపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కొండ చిలువ దాడి చేస్తే ఏ రేంజ్‌లో ఉంటుందంటే

ఇజ్రాయెల్ చేతిలో ఐరన్ బీమ్.. ఆ దేశాలకు ఇక దబిడి దిబిడే

Solar Eclipse: సూర్య గ్రహణం వేళ.. గూగుల్ మ్యాజిక్ టచ్

యూట్యూబ్‌లో చైన్ స్నాచింగ్ చేయడం నేర్చుకుని.. తొలి ప్రయత్నంలోనే

మందుకొట్టి స్కూలుకొచ్చిన హెడ్‌మాస్టర్‌.. అధికారులపైనే



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *