ఆరోగ్యమే మహాభాగ్యం.. ఆరోగ్యానికి మించిన సంపద లేదంటారు మన పెద్దవారు. అందుకే ఆరోగ్యం విషయంలో తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతారు. కానీ జీవనశైలి , తీసుకుంటున్న ఆహారం వలన చాలా మంది అనారోగ్య సమస్యల బారిన పడుతుంటారు. అయితే ముఖంలో కొన్ని లక్షణాలు కనిపిస్తే అది ప్రాణానికే ప్రమాదం అంటున్నారు వైద్యనిపుణులు. కాగా, ఈ లక్షణాలు గురించి పూర్తిగా తెలుసుకుందాం.
ప్రస్తుత కాలంలో చాలా మంది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. తీసుకుంటున్న ఆహారం, జీవన శైలి కారణంగా అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అయితే ముఖంలో కనిపించే కొన్ని లక్షణాలు,గుండెపోటు సమస్యను ముందుగానే తెలియజేస్తున్నట్లు అంట. అస్సలే వాటిని విస్మరించకూడదంట. కాగా, గుండెపోటు వచ్చే ముందు ముఖం పై ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు చూద్దాం.
పంటి నొప్పి సాధారణం అనుకుంటారు అందరు. కానీ పంటి నొప్పి కూడా గుండె పోటు సంకేతమే అంటున్నారు ఆరోగ్యనిపుణులు. అం దుకే పదే పదే మీకు దవడ నొప్పి, పంటి నొప్పి వంటి సమస్యలు ఎదురు అవుతే, నిర్లక్ష్యం చేయకుండా, వైద్యుడిని సంప్రదించాలంట. లేకపోతే ఇది ప్రాణాలకే ముప్పు తీసుకొస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
కొంత మంది దవడ నొప్పి ఎక్కువగా వస్తుంటుంది. వారు దానిని అంతగా పట్టించుకోరు కానీ, దవడ నొప్పి అనేది పదే పదే ఎక్కువగా వస్తుంటే, అది గుండెపోటుకు కారణం అవుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. దీని వలన అనేక సమస్యలు ఎదురు అయ్యే ప్రమాదం ఉన్నదంట.అందుకే ఈ విషయంలో అస్సలే నిర్లక్ష్యం చేయ్యకూడదంట.
అలాగే కొందరికి చిగుళ్ల నుంచి రక్తస్రావం అతిగా జరుగుతుంటుంది. అయితే చిగుళ్ల నుంచి రక్తస్రావం జరిగినా కూడా అసలే నిర్లక్ష్యం చెయ్యకూడదని చెబుతున్నారు వైద్య నిపుణులు. దీని వలన అనేక ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉన్నదంట. అందుకే చిగుళ్ల నుంచి పదే పదే రక్తస్రావం వస్తే వైద్యులను సంప్రదించాలంట.