కావాల్సిన పదార్దాలు : పచ్చి శెనగపప్పు , అర టీ స్పూన్ ఆవాలు , అర టీ స్పూన్ జీలకర్ర , క్యారెట్ తరుగు , పచ్చిమిర్చి పేస్ట్, ఒక కప్పు పెరుగు, ఒక కప్పు మినపప్పు, రెండు కప్పులు రాగి పిండి , కరివేపాకు ఆకులు, ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకోవాలి.
ముందుగా స్టవ్ వెలిగించి దాని మీద ఒక పాన్ పెట్టి దానిలో ఆయిల్ వేసి అది వేడయ్యాక ఒక టీ స్పూన్ శెనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసి పోపు పెట్టాలి. ఆ తర్వాత దానిలో పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ ముక్కలు కూడా వేసి
బాగా వేయించాలి
ఇప్పుడు దానిలో ఒక కప్పు బొంబాయి రవ్వ , పది నిముషాలు ఉంచి బాగా వేయించండి. కొద్దీ సేపటి తర్వాత ఒక కప్పు రాగి పిండి,
5 నిముషాలు వేయించాక కొత్తిమీర ఆకులు కూడా ఉంచి వేయించి, కిందకి దించి 5 నిముషాలు చల్లారనివ్వాలి.
ఆరిపోయిన తర్వాత దానిలో రుచికి సరిపడా ఉప్పు, 2 కప్పుల పెరుగు, రెండు గ్లాస్ లు నీళ్లు పోస్తూ మూతపెట్టి 20 నిమిషాలు పక్కన దీనిని పెట్టుకోండి. ఆ తర్వాత మూత దీనిలో కొంచం సోడా ఉప్పు, ఇడ్లీ పిండి లాగా చేతులతో కలుపుకోవాలి.
ఆ తర్వాత ఇడ్లీ వేసే పాత్ర తీసుకుని వాటిలో గరిటె తో పెట్టి ఉడికించుకోవాలి. 10 నిముషాల్లో రాగి ఇడ్లీ రెడీ అవుతుంది. అయితే, మీరు ఇడ్లీ వేసేటప్పుడు పలుచటి దుస్తువు అయితే మంచిది. ఇడ్లీలు దూదిలా మెత్తగా వస్తాయి. తినడానికి చాలా బావుంటాయి.




