
సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కి ప్రేక్షకులను మెప్పించాయి. ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఆదరణ లభించని సినిమాలు కొన్ని ఉంటాయి. కథ కథనం బాగున్నప్పటికీ సినిమా ప్రేక్షకులను మెప్పించలేవు.. కానీ ఆతర్వాత టీవీల్లోనో, ఓటీటీల్లోనో వచ్చిన తర్వాత అవి ప్రేక్షకులను మెప్పిస్తుంటాయి. అలాగే సినిమా పాటలు కూడా వాటినే అండరేటెడ్ అంటుంటారు. టాలీవుడ్ లో ఎన్నో అండరేటెడ్ సాంగ్స్ ఉన్నాయి. అలాంటి వాటిలో పద్మావతి అనే సాంగ్ ఒకటి. 90’s కిడ్స్ లో చాలా మందికి ఈ సాంగ్ ఇష్టం అనే చెప్పాలి. ఈ సాంగ్ అదిరిందయ్యా చంద్రం అనే సినిమాలోని సాంగ్. శివాజీ హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
మూడు పెళ్లిళ్లు.. అన్ని ఫ్లాప్..! తనకన్నా 25ఏళ్ల చిన్నవాడిని పెళ్లాడిన స్టార్ హీరోయిన్.!!
శ్రీనివాస రెడ్డి దర్శకత్వం వహించిన సినిమా 2005లో విడుదలైంది. అలాగే ఈ సినిమాలో శివాజీ , లయ, సంగీత మరియు మధు శర్మ నటించారు. అదేవిధంగా ఈ సినిమాకు ఎంఎం శ్రీలేఖ సంగీతం అందించారు. ఈ సినిమాలో సాంగ్స్ అన్ని మంచి ప్రేక్షకాదరణ పొందాయి. వాటిలో పద్మావతి పద్మావతి అంటూ సాంగ్ సాంగ్ ప్రేక్షకులను ఉర్రుతలూగించింది. ఆ తర్వాత ఈ సాంగ్ ఎక్కడ పెద్దగా వినిపించలేదు. అయితే ఇప్పుడు ఈ సాంగ్ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.
దిమాక్ ఖరాబ్..! ఎనిమిది మంది డైరెక్టర్లు తీశారు.. మనుషుల్నిపీక్కు తినే హారర్ మూవీ..!! ఎక్కడ చూడొచ్చంటే
పద్మావతి పద్మావతి సాంగ్ కు ఇద్దరు చిన్నారులు డాన్స్ చేసిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ సాంగ్ లో ఓ బుడతడు తన డాన్స్ స్టెప్పులతో అదరగొట్టాడు. వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ ఈవెంట్‌లో ఇద్దరు చిన్నారులు ఈ సాంగ్ కు డాన్స్ చేశారు. పాత వీడియో అయినప్పటికీ ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇది. ఈ సాంగ్ కు 90’s కిడ్స్ మరోసారి వైబ్ అవుతున్నారు. ఆ బుడతడి డాన్స్ పై మీరూ ఓ లుక్కేయండి.
బుసకొట్టే నాగు పామును భయం లేకుండా పట్టేసుకుంది.. ఈ పాప ఎవరో తెలుసా.?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి