ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా బీహార్లో ముఖ్యమంత్రి మహిళా రోజ్గర్ యోజనను ప్రారంభించారు. బీహార్లో 75 లక్షల మంది మహిళల బ్యాంకు ఖాతాల్లోకి ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున నేరుగా జమ చేశారు. మొత్తం రూ.7,500 కోట్లు బదిలీ చేశారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఇతర మంత్రుల సమక్షంలో ప్రధాని మోదీ ఢిల్లీ నుండి వర్చువల్గా ఈ పథకాన్ని ప్రారంభించారు.
ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజనను ప్రారంభించిన తర్వాత ప్రధాని మోదీ మాట్లాడుతూ.. “ఈ పవిత్రమైన నవరాత్రి రోజులలో బీహార్ మహిళలతో కలిసి వారి ఆనందంలో భాగం కావడం నాకు సంతోషంగా ఉంది. నేను లక్షలాది మంది మహిళలను తెరపై చూస్తున్నాను, వారి ఆశీర్వాదాలు మనందరికీ గొప్ప బలాన్ని ఇస్తున్నాయి. వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను” అని ప్రధాని మోదీ అన్నారు.
VIDEO | PM Narendra Modi (@narendramodi), after launching the Mukhyamantri Mahila Rojgar Yojana, says, “On these auspicious days of Navratri, I am glad to join the women of Bihar in their happiness. I see lakhs of women on the screen, and their blessings are a great source of… pic.twitter.com/tRbPiEOq96
— Press Trust of India (@PTI_News) September 26, 2025
మొత్తం బీహార్ కోసం పనిచేస్తాం..
ఈ సందర్భంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాట్లాడుతూ.. “చాలా పనులు జరుగుతున్నాయని, ప్రధానమంత్రి మీ కోసం పనిచేస్తున్నారని నేను మహిళలకు చెప్పాలనుకుంటున్నాను. గత ప్రభుత్వం మహిళల కోసం పని చేయలేదు. పైగా ఆయన(లాలూ ప్రసాద్ యాదవ్) తన భార్యను ముఖ్యమంత్రిని చేశారు. ఆయన తన కుటుంబం గురించి ఆందోళన చెందారు. మేము మా కుటుంబాలను చూసుకోం. మేము మొత్తం బీహార్ కోసం పని చేస్తాం.” అని అన్నారు. బీహార్లోని NDA ప్రభుత్వం చేపట్టిన ముఖ్యమంత్రి మహిళా రోజ్గర్ యోజన, స్వయం ఉపాధి, జీవనోపాధి అవకాశాల ద్వారా మహిళా సాధికారతను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ పథకాలు విజయానికి ఉపయోగపడతాయని ఎన్డీయే కూటమి భావిస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి