ప్రజలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఎలక్ట్రిక్ స్టవ్ వాడితే కరెంట్ బిల్లుపై సబ్సిడీ.. ఎంతంటే?

ప్రజలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఎలక్ట్రిక్ స్టవ్ వాడితే కరెంట్ బిల్లుపై సబ్సిడీ.. ఎంతంటే?


ప్రజలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఎలక్ట్రిక్ స్టవ్ వాడితే కరెంట్ బిల్లుపై సబ్సిడీ.. ఎంతంటే?

ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా యుద్ధంతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. తమ దేశంలో అమెరికా, ఇజ్రాయెల్ కలిసి దాడికి దిగడంతో ఇరాన్ సైతం ప్రతీకార దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా చమురు సరఫరా నిలిచిపోయింది. ముఖ్యం హర్ముజ్ జలసందిని ఇరాన్ క్లోజ్ చేయడంతో ఈ ఎఫెక్ట్ ప్రపంచంలోని అన్ని దేశాలపై పడింది. దీంతో మన దేశంలోనూ గ్యాస్ కొరత ఏర్పడింది. ఇక గ్యాస్ లేకపోవడంతో చాలా నగరాల్లో హోటల్‌లు, రెస్టారెంట్స్ మూతపడ్డాయి. ఈ క్రమంలో జనాలకు ఊరటనిచ్చేందుకు తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్యాస్‌కు బదులు ఎలక్ట్రిక్ స్టవ్‌లు ఉపయోగించే  వారికి యూనిట్ విద్యుత్‌పై రూ.2 సబ్సిడీ అందించనున్నట్లు ప్రకటించింది.

రాష్ట్రంలో గ్యాస్ కొరత కారణంగా హోటల్‌లు, రెస్టారెంట్‌లు మూతపడడం, ఉన్న హోటల్స్‌ రేట్లు భారీ పెంచేయడంతో హస్టల్స్‌ ఉన్న విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై దృష్టి సారించిన సీఎం స్టాలిన్ ఈ సమస్యను పరిష్కరించేందుకు అధికారులతో సమావేశపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని టీస్టాళ్లు, హోటళ్లు, రెస్టారెంట్‌లు, క్లౌడ్ కిచెన్ వంటి ఆహార తయారీ కేంద్రాలు గ్యాస్ సిలిండర్లకు బదులుగా ఎలక్ట్రిక్ స్టౌవ్‌లను వాడితే వారికి ఒక యూనిట్ విద్యుత్‌పై రూ.2 సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించారు.

రాష్ట్రంలో గ్యాస్‌ కొరత ఉన్నందున వంట కోసం గ్యాస్‌కు బదులుగా విద్యుత్‌ వినియోగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఎం స్టాలిన్ చెప్పుకొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ కొరత తగ్గేంత వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని.. అప్పటి వరకు విద్యుత్‌ వినియోగంపై సబ్సిడీ అమలు చేయనున్నట్టు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *