
ప్రకృతి రమణీయతకు నిలయమైన అరకు లోయలో ఒక అరుదైన దృశ్యం స్థానికులను, పర్యాటకులను మంత్రముగ్ధులను చేసింది. అరకు వ్యాలీ మండలం బస్కి పంచాయితీ పరిధిలోని గుగ్గుడు గ్రామంలో మధ్యాహ్నం వేళ జంటపాములు ఒకదానికొకటి పెనవేసుకుంటూ చేసిన ‘సయ్యాట’ నెట్టింట సెన్సేషన్‌గా మారింది.స్థానిక గ్రామస్తులు తమ జీడిమామిడి తోటల్లో పనులకు వెళ్తుండగా, పంటచేల మధ్య ఈ జంటపాములు కనిపించాయి. నీరెండ పడుతున్న వేళ, రెండు భారీ సర్పాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నట్లుగా పెనవేసుకుంటూ ఆకాశం వైపు ఎగిసిపడుతూ నృత్యం చేశాయి. సాధారణంగా ఇలాంటి దృశ్యాలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. అయితే, జనావాసాలకు దగ్గరగా, ఇంత స్పష్టంగా ఈ దృశ్యం కనిపించడంతో అటుగా వెళ్తున్న వారు ఆశ్చర్యంతో ఆగిపోయారు. ఓ పక్క భయపడుతూనే ఆ అపురూప దృశ్యాన్ని స్థానికులు తమ సెల్‌ఫోన్లలో వీడియోలు చిత్రీకరించారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లోనే వైరల్‌గా మారింది. “అరకు అందాలకు ఈ జంటపాముల నాట్యం మరిన్ని హంగులు అద్దింది” అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
స్పిరిట్ కథలో అవే హైలైట్స్ !
గ్లోబల్ రేంజ్‌లో వారణాసి బ్రాండింగ్
ఉస్తాద్ ప్రమోషన్స్‌లో నయా స్ట్రాటజీ