పోలీసుల నుంచి తప్పించుకున్న మోస్ట్‌వాంటెడ్‌ క్రిమినల్.. డ్రోన్లతో గాలింపు.. అసలు ఎవరీ ప్రభాకర్‌..?

పోలీసుల నుంచి తప్పించుకున్న మోస్ట్‌వాంటెడ్‌ క్రిమినల్.. డ్రోన్లతో గాలింపు.. అసలు ఎవరీ ప్రభాకర్‌..?


ఆంధ్రప్రదేశ్ పోలీసుల ఎస్కార్ట్‌ నుంచి తప్పించుకున్న మోస్ట్‌వాంటెడ్‌ క్రిమినల్‌ బత్తుల ప్రభాకర్ కోసం వేట కొనసాగుతోంది. ఈ ఆపరేషన్‌ కోసం మూడు స్పెషల్‌ టీమ్స్‌ రంగంలోకి దిగి ఏపీతోపాటు తెలంగాణలోనూ గాలిస్తున్నాయి. డ్రోన్లు సైతం వినియోగిస్తూ ప్రభాకర్‌ కోసం గల్లీగల్లీలో జల్లెడ పడుతున్నారు. అసలు ఎవరీ ప్రభాకర్‌..? రెండు రాష్ట్రాల పోలీసులను మూడు చెరువుల నీళ్ల తాగిస్తున్న ఈ ప్రభాకర్‌ క్రైమ్‌ హిస్టరీ ఏంటి..? అంతటి మోస్ట్‌వాంటెడ్‌ క్రిమినల్‌ అంత ఈజీగా ఎలా తప్పించుకున్నాడు..?

ఆంధ్రప్రదేశ్ పోలీసుల చెర నుండి తప్పించుకున్న నిందితుడు బత్తుల ప్రభాకర్.. హైదరాబాద్‌లోని ప్రిజం పబ్బు కాల్పుల కేసులో కీలక వ్యక్తి. ఈ కేసులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న ప్రభాకర్‌ను పీటీ వారెంట్‌పై ఏపీకి తీసుకెళ్లారు పోలీసులు. సోమవారం (సెప్టెంబర్ 22) విజయవాడ కోర్టులో హాజరుపర్చి రాజమండ్రి జైలుకు తరలిస్తుండగా పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయాడు ప్రభాకర్. డిన్నర్‌ కోసం ఓ దాబా దగ్గర ఆగినప్పుడు పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్నాడు. దీంతో ఎస్కార్ట్ పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు.

పబ్బులో పోలీసులపై కాల్పులు

ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్‌ ప్రిజం పబ్‌లో ఇద్దరు పోలీసులపై కాల్పులు జరిపే ప్రయత్నం చేయడంతో బత్తుల ప్రభాకర్‌ అరెస్ట్‌ అయ్యాడు. ఆరోజు బత్తుల ప్రభాకర్‌ నుంచి 5వందలకు పైగా బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు గచ్చిబౌలి పోలీసులు. బత్తుల ప్రభాకర్ పరారీ ఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్‌ వేటేశారు ఉన్నతాధికారులు.

అసలు ఎవరీ ప్రభాకర్‌..?

చిత్తూరు జిల్లాకి చెందిన మోస్ట్‌వాంటెడ్‌ బత్తుల ప్రభాకర్‌పై తెలుగు రాష్ట్రాల్లో వందకు పైగా చోరీ, దోపిడీ కేసులు ఉన్నాయి. ఏపీ, తెలంగాణతోపాటు కర్ణాటక, తమిళనాడులోనూ ప్రభాకర్‌పై కేసులున్నాయి. 2020లో మొదటిసారి విశాఖలో అరెస్ట్‌ అయిన ప్రభాకర్‌.. 2022లో మొదటిసారి పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయాడు. మళ్లీ ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్‌ గచ్చిబౌలి పోలీసులకు పట్టుబడ్డాడు. ఆరోజు ప్రభాకర్‌ను అదుపులోకి తీసుకుంటుంటడగా పోలీసులపైకి కాల్పులు జరిపాడు. దాంతో, కానిస్టేబుల్‌, బౌన్సర్‌కి బుల్లెట్‌ గాయాలు అయ్యాయి. స్పాట్‌లోనే ప్రభాకర్‌ నుంచి రెండు తుపాకులు, 20 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆ తర్వాత ప్రభాకర్‌ ఇంట్లో సోదాలు చేసి 563 బుల్లెట్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. కొట్టేసిన సొత్తుతో జల్సాలు చేయడం బత్తుల ప్రభాకర్‌ హాబీ. ఇలాంటి మైండ్‌ సెట్‌ ఉన్నాడు బోన్‌ నుంచి తప్పించుకున్నాడు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *