మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లా, బద్గడి ఖుర్ద్ గ్రామంలో నివసిస్తున్న సాధారణ రైతు దంపతులు రాధారమణ, గోల్డార్ జీవితాలను ఒక్కసారిగా మార్చే సంఘటన చోటుచేసుకుంది. వారు లీజుకు తీసుకున్న వ్యవసాయ భూమిలో తవ్వకాలు చేస్తుండగా, అనుకోకుండా ఎనిమిది వజ్రాలు లభించాయి. ఈ వజ్రాలను వారు వెంటనే పన్నాలోని వజ్రాల కార్యాలయానికి అప్పగించారు. వారం రోజుల వ్యవధిలో ఈ వజ్రాలు లభించడం విశేషం. వజ్రాల నిపుణుడు అనుపం సింగ్ ఈ వజ్రాల మొత్తం బరువు 3.10 క్యారెట్లు అని, వీటిలో ఆరు అత్యంత నాణ్యమైనవి అని తెలిపారు. 0.14 క్యారెట్లు నుండి 0.79 క్యారెట్ల బరువున్న వజ్రాలు ఉన్నాయి. త్వరలో జరగనున్న వేలంలో వీటిని అమ్ముతారు. వేలం తర్వాత ప్రభుత్వ రాయల్టీ, పన్నులు మినహాయించి మిగిలిన మొత్తం గోల్డార్ దంపతులకు అందజేస్తారు.
మరిన్ని వీడియోల కోసం :