సినిమా ఇండస్ట్రీలో లవ్ ఎఫైర్లు, పెళ్లి, విడాకులు అనేవి చాలా కామన్. హీరోయిన్స్ విషయంలో మనకు ఎక్కువగా గ్లామర్, స్టార్ డమ్ మాత్రమే కనిపిస్తాయి. కానీ కొంతమంది జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నవారు ఉన్నారు. కెరీర్ బిగినింగ్ లో ఎన్నో కష్టాలు పడి ఆతర్వాత హీరోయిన్స్ గా సక్సెస్ అయినా వారు చాలా మంది ఉన్నారు. అలాగే కొంతమంది హీరోయిన్స్ వ్యక్తిగత విషయంలోనూ ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. ఇక ప్రేమలు, పెళ్లిలాంటి విషయాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొంతమంది రెండు మూడు పెళ్లి చేసుకొని వార్తల్లో నిలిచిన వారు చాలా మంది ఉన్నారు. వారిలో ఈ స్టార్ హీరోయిన్ ఒకరు. కెరీర్‌లో అద్భుతమైన విజయాలు సాధించినా ఆ హీరోయిన్ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో కష్టాలను చూసింది. ఆమె ఎవరో తెలుసా.?
ఒక్కసారిగా పాము కరిచేసింది.. అతను చనిపోయేసరికి అందరం షాక్ అయ్యాం..!
బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చున్న భామ.. లీనా చందావర్కర్. సినిమా పరిశ్రమలో 1960ల చివరి మరియు 1970ల ప్రారంభంలో ప్రముఖ నటిగా పేరు తెచ్చుకున్నారు. ఆమె హిందీ సినిమాల్లో హీరోయిన్‌గా నటించి మెప్పించారు లీనా చందావర్కర్. ఫిల్మ్‌ఫేర్ ఫ్రెష్ ఫేస్ పోటీలో రన్నరప్‌గా నిలిచి, ప్రచారాలు చేస్తూ సినిమాల్లోకి ప్రవేశించారు. సునీల్ దత్త్ దర్శకత్వంలో 1968లో మన్ కా మీట్తో డెబ్యూ చేశారు.
ఇవి కూడా చదవండి
లక్షల్లో సంపాదిస్తున్నా..శ్మశానంలో ఆరు అడుగుల స్థలం మాత్రమే ఉంది.. సీరియల్ బ్యూటీ ఓపెన్ కామెంట్స్
1969 నుంచి 1979 వరకు 50కి పైగా సినిమాల్లో నటించారు. ధర్మేంద్ర, రాజేష్ ఖన్నా, సంజీవ్ కుమార్, దిలీప్ కుమార్, జీతేంద్ర వంటి స్టార్లతో ఆమె నటించారు. అయితే లీనా జీవితం ట్రాజెడీ మాత్రం ఎక్కువే.. 1975లో 24 ఏళ్ల వయసులో గోవా ముఖ్యమంత్రి దయానంద్ బండోడ్కర్ కుమారుడు సిద్ధార్థ్ బండోడ్కర్‌ను వివాహం చేసుకున్నారు లీనా. కానీ పెళ్ళైన 11 రోజుల్లోనే గన్ ఫైర్ ప్రమాదంలో సిద్ధార్థ్ మరణించారు. ఈ ఘటన ఆమె కెరీర్‌ను ప్రభావితం చేసింది. ఆతర్వాత 1980లో పాపులర్ సింగర్ కిషోర్ కుమార్‌ను వివాహం చేసుకున్నారు. ఆ సమయంలో ఆమె 7 నెలల గర్భవతిగా ఉంది. వారికి సుమీత్ కుమార్ అనే కుమారుడు. 1987లో కిషోర్ హార్ట్ అటాక్‌తో మరణించారు, లీనా 37 ఏళ్ల వయసులో రెండో భర్త కూడా చనిపోయాడు. ఆతర్వాత ఆమె ఒంటరిగానే ఉంటున్నారు. ఒంటరిగా కొడుకుతో పాటు మరికొంతమంది పిల్లలను కూడా దత్తత తీసుకొని పెంచుకున్నారు లీనా.. ప్రస్తుతం ఆమె ముంబైలో నివాసముంటున్నారు.
ఆ ఒక్క హీరోయిన్నే ఫాలో అవుతున్న విజయ్ సేతుపతి.. ఆమె ఎవరంటే
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.