పెద్ద వార్నింగే.! రిషబ్ పంత్‌కు ఇచ్చిపడేసిన యంగ్ ప్లేయర్.. ఇక లగేజీ ప్యాక్ చేసుకోవాల్సిందేనా?

పెద్ద వార్నింగే.! రిషబ్ పంత్‌కు ఇచ్చిపడేసిన యంగ్ ప్లేయర్.. ఇక లగేజీ ప్యాక్ చేసుకోవాల్సిందేనా?


Dhruv Jurel vs Rishabh Pant: భారత క్రికెట్‌లో వికెట్ కీపర్ – బ్యాటర్ స్థానం కోసం గట్టి పోటీ నెలకొంది. ఈ పోటీలో ఇటీవల ధ్రువ్ జురెల్ తన అద్భుతమైన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియా-ఏతో జరిగిన అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో జురెల్ సాధించిన శతకం, అంతర్జాతీయ క్రికెట్‌లో అతని స్థానం పదిలం చేసుకోబోతోందని స్పష్టం చేస్తోంది. ఈ ప్రదర్శన ప్రస్తుతం భారత టెస్ట్ జట్టు వికెట్ కీపర్‌గా ఉన్న రిషబ్ పంత్‌కు గట్టి హెచ్చరిక పంపిందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

జురెల్ సెంచరీ విశేషాలు..

ఆస్ట్రేలియా-ఏతో జరిగిన టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో ధ్రువ్ జురెల్ 132 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 113 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్ కేవలం పరుగుల పరంగానే కాకుండా, జురెల్ ప్రదర్శించిన సంయమనం, టెక్నిక్, ఒత్తిడిలో నిలబడి ఆడిన తీరు కూడా ప్రశంసనీయం. గతంలో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లోనూ జురెల్ 90 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడి తన సత్తా చాటుకున్నాడు. అతని ఈ ప్రదర్శనలు అతను అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణించగలడని నిరూపించాయి.

పంత్‌కు ఎదురైన సవాలు..

రిషబ్ పంత్ ఒక రోడ్డు ప్రమాదం నుంచి కోలుకుని ఇటీవలే క్రికెట్‌లోకి తిరిగి వచ్చాడు. ఐపీఎల్, టీ20 ప్రపంచకప్‌లో ఆడాడు. టెస్ట్ క్రికెట్‌లోకి కూడా బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లో రీఎంట్రీ ఇచ్చి, సెంచరీతో అదరగొట్టాడు. పంత్ తన దూకుడు బ్యాటింగ్‌తో, టెస్ట్ క్రికెట్‌కు కొత్త నిర్వచనం ఇచ్చాడు. అయితే, అతని ఫామ్, ఫిట్‌నెస్ విషయంలో కొన్ని సందేహాలు ఉన్న నేపథ్యంలో జురెల్ ప్రదర్శన పంత్‌కు గట్టి సవాలుగా మారింది. జురెల్ సెంచరీ పంత్‌కు ప్రత్యక్ష హెచ్చరిక లాంటిదే. పంత్ తన స్థానాన్ని నిలబెట్టుకోవాలంటే నిలకడగా రాణించాల్సిన అవసరం ఉందని ఈ ప్రదర్శన గుర్తుచేస్తుంది.

ఇవి కూడా చదవండి

భవిష్యత్తులో పోటీ..

భారత క్రికెట్‌లో వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్ స్థానం కోసం గతంలో ఎప్పుడూ లేనంత పోటీ ఉంది. పంత్, జురెల్ మాత్రమే కాకుండా, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ వంటి యువ ఆటగాళ్లు కూడా ఈ స్థానం కోసం పోటీపడుతున్నారు. కానీ, టెస్ట్ ఫార్మాట్‌లో జురెల్ చూపుతున్న నిలకడ, అతని టెక్నిక్, వికెట్ కీపింగ్ నైపుణ్యాలు అతన్ని పంత్‌కు ప్రత్యామ్నాయంగా చూసేలా చేశాయి. జురెల్ అద్భుత ప్రదర్శనలు కొనసాగిస్తే, సెలెక్టర్లకు ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. జట్టులో ఒక వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ స్థానాన్ని ఎవరికి ఇవ్వాలి? దూకుడుగా ఆడే పంత్‌కా, లేక నిలకడగా, సాంప్రదాయ పద్ధతిలో ఆడే జురెల్‌కా? అనేది భవిష్యత్తులో ఆసక్తికరమైన చర్చకు దారితీసే అవకాశం ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *