హీరోయిన్ పూజా హెగ్డే గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు కొన్ని సంవత్సరాల క్రితం వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిందీ అందాల తార. తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస హిట్ చిత్రాలను అందించిన ఘనత పూజా హెగ్డేకి దక్కింది.
మోడలింగ్ రంగం నుంచి సినిమాల్లోకి వచ్చిన ఈ అమ్మడు.. ముకుంద, ఒక లైలా కోసం సినిమాలతో తెలుగు తెరకు పరిచయమైంది. కెరీర్ మొదట్లో ప్లాపులే అందకున్నప్పటికీ అందం, అభినయంతో మెస్మరైజ్ చేసింది.
దీంతో ఈ బ్యూటీకి ఆఫర్స్ క్యూ కట్టాయి. దువ్వాడ జగన్నాథం, అరవింద సమేత, మహర్షి, గద్దలకొండ గణేష్, అలా వైకుంఠపురంలో వంటి చిత్రాలతో వరుసగా హిట్లు అందుకుంది. అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ తదితర తెలుగు స్టార్ నటులందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది.
అయితే వరుస హిట్లే కాదు.. ఆ తర్వాత వచ్చిన ప్లాపులు అమ్మాడి కెరీర్ ను అయోమయంలో పడేశాయి. రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్ చిత్రాలు డిజాస్టర్స్ కావడంతో పూజా సైలెంట్ అయ్యింది. కొన్నాళ్లుగా తెలుగు, తమిళంలో అవకాశాలు తగ్గిపోవడంతో బాలీవుడ్ షిప్ట్ అయ్యింది. అక్కడ కూడా ప్లాపులే ఎదురుకావడంతో కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉండిపోయింది.
ఇక ఇటీవలే రెట్రో మూవీతో సౌత్ లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా సైతం నిరాశపరచడంతో మళ్లీ పరిస్థితి మొదటికి వచ్చింది. ఇటీవలే రజినీకాంత్ నటించిన కూలీ చిత్రంలో అదరగొట్టింది. ఇందులో మోనికా అంటూ స్పెషల్ పాటలో స్టెప్పులతో ఓ ఊపు ఊపేసింది. కానీ ఆ సినిమా కూడా ప్రేక్షకులను నిరాశపరిచింది.