పుచ్చకాయ గింజలు తింటున్నారా..? వాయమ్మో.. ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..

పుచ్చకాయ గింజలు తింటున్నారా..? వాయమ్మో.. ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..


వేసవికాలం వచ్చిందంటే చాలామందికి ముందుగా గుర్తుకువచ్చేది పుచ్చకాయ. శరీరానికి చల్లదనాన్ని అందించడానికి, వేడిని తగ్గించడానికి ఇది ఒక అద్భుతమైన పండు.. పుచ్చకాయ 90శాతానికి పైగా నీటిని కలిగి ఉండి, శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో, బరువు తగ్గడంలో, గుండె ఆరోగ్యానికి (లైకోపీన్ వల్ల) చాలా మేలు చేస్తుంది. ఇందులో విటమిన్లు A, C, పొటాషియం, సిట్రులిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడం, రక్తపోటును అదుపు చేయడం, కండరాల నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి.

పుచ్చకాయలో చాలా తక్కువ కేలరీలు ఉంటాయి. 100 గ్రాముల ఎర్రటి పుచ్చకాయ ముక్కల్లో కేవలం 16 కేలరీల శక్తి మాత్రమే ఉంటుంది. దీనిని అర్థం చేసుకోవడానికి, అర కిలో పుచ్చకాయ తిన్నా, అది ఒక బజ్జీ లేదా సమోసాకు సమానమైన కేలరీలను మాత్రమే ఇస్తుంది. అంటే, అధిక కేలరీలుండే వేరే ఆహార పదార్థాలతో పోలిస్తే, పుచ్చకాయ ద్వారా శరీరానికి తక్కువ శక్తి లభిస్తుంది.

పుచ్చకాయలో 96 శాతం నీరు ఉంటుంది. ఇది శరీరానికి కావాల్సిన హైడ్రేషన్‌ను అందిస్తుంది. ఖర్భూజా వంటి పండ్లతో పోలిస్తే పుచ్చకాయలో విటమిన్లు, మినరల్స్, సాల్ట్స్ తక్కువగా ఉంటాయి. అయినప్పటికీ, దాని తియ్యని రుచి, చల్లదనం, ఎర్రటి రంగు కారణంగా వేసవిలో పుచ్చకాయ ప్రజలలో బాగా ప్రాచుర్యం పొందింది. ఇది ఎంప్టీ కేలరీలు అందించే ఒక మంచి పండు.

పుచ్చకాయను సరైన సమయాల్లో తీసుకోవడం చాలా ముఖ్యం. సాయంత్రం 5 నుండి 5:30 గంటల మధ్య ఒక గ్లాసు పుచ్చకాయ రసం తాగడం లేదా ముక్కలు తినడం మంచిది. పిల్లలు పాఠశాల నుండి ఇంటికి వచ్చినప్పుడు, ఆడుకోవడానికి వెళ్లే ముందు దీనిని అందించడం వల్ల వారికి మంచి ఆకలి పుడుతుంది. భోజనానికి, రాత్రి భోజనానికి అరగంట నుండి గంట ముందు పుచ్చకాయ ముక్కలు లేదా రసం తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది ఆకలిని పెంచుతుంది, పొట్టలో చల్లగా, హాయిగా అనిపిస్తుంది. ఎసిడిటీ వంటి సమస్యలు ఉన్నవారికి కూడా ఉపశమనం లభిస్తుంది.

పుచ్చకాయను కడుపు నిండా తినవచ్చు. తక్కువ కేలరీలతో సంతృప్తి లభిస్తుంది. షుగర్ ఉన్నవారు కూడా పుచ్చకాయను భయం లేకుండా తీసుకోవచ్చు.. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచదు. వృద్ధులు, పిల్లలు, పసి పిల్లలకు కూడా పుచ్చకాయ ముక్కలు లేదా రసం చాలా మంచిది.

పుచ్చకాయ గింజలు తింటే..

పుచ్చకాయ గింజల విషయానికి వస్తే, పండు తినేటప్పుడు వాటిని ఊసేయడం మంచిది. గింజలు చాలా బలం. 100 గ్రాముల పుచ్చ గింజల పప్పులో 34 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.. ఇది జీడిపప్పు, మాంసం వంటి వాటికంటే ఎక్కువ. అయితే, పండుతో పాటు గింజలు తినడం వల్ల అసౌకర్యంగా అనిపించవచ్చు. మార్కెట్లో లభించే పుచ్చ గింజల పప్పును కొని, నానబెట్టి తినడం మంచిదని పేర్కొంటున్నారు.. వేసవిలో పుచ్చకాయను సరైన పద్ధతిలో వాడుకోవడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.. ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే.. ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *