ఏదో ఒక కారణంతో తమ పీఎఫ్ సొమ్ములో కొంత భాగాన్ని విత్డ్రా చేసుకోవచ్చని చాలామంది భావిస్తుంటారు. కాని ఈపీఎఫ్ఓ నిబంధనలు నిధుల దుర్వినియోగానికి ఒప్పుకోవు. ప్రస్తుత ఈపీఎఫ్ఓ మార్గదర్శకాల ప్రకారం రిటైర్మెంట్ తర్వాత లేక 58 ఏళ్ల పదవీ విరమణ వయసుకు చేరుకున్న తర్వాత మాత్రమే పీఎఫ్ నిధులను విత్డ్రా చేసుకోవచ్చు. అయితే పిల్లల విద్య, వైద్యం, వివాహం, ఇంటి నిర్మాణం వంటి నిర్దిష్టమైన అవసరాలకు పాక్షికంగా నిధులను విత్డ్రా చేసుకోవచ్చు. నిధులకు సంబంధించిన ప్రతి ఉపసంహరణకు ఏ కారణం కోసం నిధులను ఉపయోగిస్తున్నదీ తెలియచేయడంతోపాటు వాటిని రుజువు చేసే పత్రాలను తప్పక సమర్పించాలి. ఈ షరతులను ఉల్లంఘించిన పక్షంలో ఉపసంహరించిన నిధులను వడ్డీ, జరిమానాలతో కలిపి తిరిగి రాబట్టే అధికారం ఈపీఎఫ్ఓకి ఉంటుంది. సభ్యులు నిధుల పాక్షిక ఉపసంహరణకు దరఖాస్తు చేసే ముందు నిబంధనలు క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలని ఈపీఎఫ్ఓ సూచించింది. తప్పుడు కారణాలతో పీఎఫ్ నిధులను విత్డ్రా చేసుకున్న పక్షంలో ఈపీఎఫ్ పథకం 1952 కింద తిరిగి రాబట్టుకోవడం జరుగుతుందని ఈపీఎఫ్ఓ తన ఎక్స్ ఖాతాలో హెచ్చరించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రూ.4 కోట్ల విలువైన కరెన్సీ నోట్లతో వాసవీ కన్యకా పరమేశ్వరీ అమ్మవారికి విశేష అలంకరణ
Cheeramenu Fish: పులస వెళ్లింది.. చీరమేను వచ్చింది..
కరివేపాకు కోద్దామని పెరట్లోకి వెళ్లింది..కళ్లు మూసి తెరిచేంతలో ఆమె
అమెరికాలో భారత విద్యార్థులకు కొత్త టెన్షన్
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ రైల్వేలో 8,875 ఉద్యోగాలకు నోటిఫికేషన్