ఏ పిజ్జా షాప్‌కైనా వెళ్లండి, ఏ బర్గర్ అయినా ఆర్డర్ చేయండి. ముందుగా కనిపించేది లేవిష్‌గా డెకరేట్ చేసిన హాల్స్, కపుల్స్‌ని, పిల్లలను ఇట్టే ఎట్రాక్ట్ చేసే డిజైన్స్ ఉంటాయి. ఏ పిజ్జా సెంటర్ చూసినా హైజీన్‌కి మారుపేరేమో అనిపించేలా బిల్లింగ్ కౌంటర్‌లోనే సేఫ్టీకి హెడ్ క్యాప్స్, హ్యాండ్ గ్లోవ్స్ కనిపిస్తాయి. కానీ ఇదంతా పైకి కనిపించేవి మాత్రమే. వెనక్కి వెళ్లి ఒకసారి కిచెన్ సెంటర్‌లో చూసే అవకాశం మీకు మాకూ ఎవరికీ ఉండదు.
ఈ మధ్యకాలంలో ఫుడ్‌సేఫ్టీపై ఫోకస్ పెట్టిన అధికారులు ఆ ప్రయత్నం చేశారు. పైకి లగ్జరీగా కనిపించే పిజ్జా సెంటర్ల లోపల ఎలా ఉంటుందో చూద్దామని రెయిడ్స్ చేశారు. చాలా పోష్‌గా కనిపించే పిజ్జా సెంటర్‌లలో లోపల మెటీరియల్ అంతా గలీజే అన్న విషయం వాళ్లకి క్లారిటీ వచ్చింది. పిజ్జా హట్ అయితే ఏంటి, డోమినోస్ అయితే ఏంటి.. ఇతర ఏ షాప్ అయితే అయితే ఏంటి..? అన్ని చోట్లా ఒకటే సీన్. ఫ్రీజర్లు కాస్ట్‌లీగా ఉన్నాయి గానీ, వాటిల్లో ప్రిజర్వ్ చేసిన మెటీరియల్ అంతా ఎక్స్‌పైరీ అయిపోయినవే. అసలు ఎక్స్‌పైరీ లేనివే కనిపించాయి.
మైక్రోఓవెన్ చుట్టుపక్కలంతా క్రిమికీటకాలే. పిజ్జాతోపాటు లోపల ఉన్న కీటకాలు కూడా ఓవెన్ వేడికి మాడిపోయి పిజ్జా ఫ్లేవర్స్‌లో కలిసిపోతాయేమో అనిపించేలా ఉంది సీన్..! అన్నింటికంటే ప్రమాదకరం ఏంటంటే.. మొలకెత్తిన బంగాళాదుంపలను విపరీతంగా వాడుతున్నారు. మీకు తెలుసో లేదో బంగాళాదుంపలు మొలకెత్తితే విషంతో సమానం..! ఇదే కాదు.. పిజ్జాలకు వాడే అనేక రకాల పదార్థాల గురించి తెలిసిన మెడికల్ సర్టిఫికెట్ ఉంటేనే వాళ్లు పిజ్జా సెంటర్లలో పనిచేయాలి. కానీ అవేమీ లేకుండానే స్టాల్స్ నిర్వహిస్తున్నారు సిబ్బంది. దీంతో పలు పిజ్జా తయారీ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కేసులు నమోదు చేశారు.
తెలంగాణలోని పిజ్జాహౌస్‌లపై అధికారుల ఆకస్మిక దాడులు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 55 పిజ్జా హౌజ్‌ల్లో ఫుడ్‌సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. 18 పిజ్జా హట్ ఔట్‌లెట్లు, 16 డోమినోస్, 21 ఇతర సెంటర్లలో తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ మహానగరంతోపాటు వరంగల్, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల్లోనూ తనిఖీలు చేపట్టారు. ఎక్కడా మచ్చుకైనా కనిపించని ఫుడ్‌సేఫ్టీ నిబంధనలు. కాలం చెల్లిన సాస్‌లు వాడుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. అసలు ఎక్స్‌పైరీ డేట్ కూడా లేని సాస్ టిన్‌లను వాడుతున్నట్లు తేలింది. అంతేకాదు మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ లేని సిబ్బందితో పిజ్జాలు, బర్గర్ల తయారీ చేస్తున్నట్లు గుర్తించారు.
వీడియో చూడండి..
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..