పామును చంపడం, పాము చంపడం చూసింటారు.. కానీ పాముకు ఉసురు పోయడం చూశారా?

పామును చంపడం, పాము చంపడం చూసింటారు.. కానీ పాముకు ఉసురు పోయడం చూశారా?


తెలంగాణలోని సిరిసిల్లలో అనూహ్య ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. పాముకు సర్జరీ చేసి, ఆరు కుట్లు వేసి ప్రాణాన్ని కాపాడారు వెటర్నరీ డాక్టర్. మీరు ఎప్పుడూ ఇలాంటి సర్జరీ చూడరు.. పాముకి కూడా సర్జరీ చేయొచ్చా అని మీరు ఆశ్చర్యపడుతారు కదా! కానీ నిజంగానే జరిగింది.

రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రంపేట గ్రామంలో గాయపడిన పామును కాటిపాములకు చెందిన వ్యక్తి వెటర్నరీ డాక్టర్ వద్దకు తీసుకెళ్ళారు. సాధారణంగా మనుషులకే మందులు, ఇంజెక్షన్లు అని అనుకుంటాం. కానీ ఈసారి డాక్టర్, ఆ పాముకి ప్రత్యేకంగా ట్రీట్‌మెంట్ చేసి ప్రాణాలు నిలబెట్టారు. గ్రామస్తులు ఈ సన్నివేశాన్ని చూసి అవాక్కయ్యారు. పాముని ఎవరు దగ్గరికి వెళ్లడానికి కూడా భయపడతారు. కానీ ఈసారి, దానికి మెడిసిన్ ఇచ్చి.. పూర్తిగా ‘పేషెంట్’ లా కేర్ చేశారు.

ఇది కేవలం ఒక విచిత్ర సన్నివేశమే కాదు.. జంతువులపై కరుణ ఉంటే, ఏ జీవిని అయినా కాపాడగలమనే సందేశం కూడా. చంద్రంపేటలో కాటిపాములకు చెందిన వ్యక్తి ఇంటిలోకి పాము దూరింది. అయితే అదే సమయంలో సజ్జపై నుంచి గడ్డపార పాముపై పడింది. దీంతో పాము పొట్టలోంచి గాల్‌బ్లాడర్, పేగులు బయటకు వచ్చి పాముకు గాయమైంది. దీంతో ఇంటి యజమాని సిరిసిల్లకు చెందిన పశు వైద్యాధికారి అభిలాష్‌ను సంప్రదించగా, పాముకి చికిత్స అందించాడు. బయటకు వచ్చిన గాల్‌బ్లాడర్ పేగులను సర్ది చేసి ఆరు అంగుళాల పొడవు స్టిచెస్ వేశారు. మూడు రోజులపాటు అబ్జర్వేషన్ లో ఉంచి పూర్తిస్థాయిలో చికిత్స అందించారు. దీంతో ప్రస్తుతం పాము ఆరోగ్యంగా ఉన్నట్లు పశు వైద్యాధికారి అభిలాష్ తెలిపారు. గాయాల పాలైన పాముకు చికిత్స అందించి ఆరోగ్యంగా తయారు చేసిన డాక్టర్‌కు ఆ వ్యక్తి ధన్యవాదాలు తెలిపాడు.

వీడియో చూడండి.. 

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *