పాక్‌ ప్రధాని, ఆర్మీ చీఫ్‌తో ‍డొనాల్డ్‌ ట్రంప్‌ భేటీ..! గొప్ప లీడర్లు అంటూ..

పాక్‌ ప్రధాని, ఆర్మీ చీఫ్‌తో ‍డొనాల్డ్‌ ట్రంప్‌ భేటీ..! గొప్ప లీడర్లు అంటూ..


పాక్‌ ప్రధాని, ఆర్మీ చీఫ్‌తో ‍డొనాల్డ్‌ ట్రంప్‌ భేటీ..! గొప్ప లీడర్లు అంటూ..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం ఓవల్ కార్యాలయంలో పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్‌ అసిమ్ మునీర్‌లను కలిశారు. సమావేశానికి ముందు ట్రంప్ వారిని “గ్రేట్‌ లీడర్స్‌” అని ప్రశంసించారు. విలేకరులతో మాట్లాడుతూ.. ఇక్కడికి గొప్ప నాయకులు వస్తున్నారు. పాకిస్తాన్ ప్రధాన మంత్రి, ఫీల్డ్ మార్షల్ ఇద్దరూ గొప్ప లీడర్లు అని ట్రంప్‌ అన్నారు. గాజాలో ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాన్ని ముగించడానికి వ్యూహాలను చర్చించడానికి ఈ వారం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సందర్భంగా ట్రంప్‌ను కలిసిన ఎనిమిది ఇస్లామిక్ దేశాల సీనియర్ అధికారులలో షరీఫ్ కూడా ఉన్నారు.

ఈ సమావేశం అమెరికా, పాకిస్తాన్ మధ్య వాణిజ్య ఒప్పందం తరువాత న్యూయార్క్‌లో జరిగిన UN జనరల్ అసెంబ్లీలో నాయకులు సమావేశమైన కొద్దిసేపటికే జరిగింది. జూలైలో అమెరికా, పాకిస్తాన్ ఒక వాణిజ్య ఒప్పందంపై సంతకం చేశాయి, పాకిస్తాన్ పెద్దగా ఉపయోగించని చమురు నిల్వలను అమెరికా పెట్టుబడులకు తెరిచి, ఇస్లామాబాద్ పై సుంకాలను తగ్గిస్తుందని భావిస్తున్నారు. కాగా భారత్‌పై సుంకాలు విధించి, పాకిస్థాన్‌తో వ్యూహ్యాత్మకంగానే ట్రంప్‌ మరింత దగ్గరవుతున్నారని తెలుస్తోంది. రష్య చమురు కొనుగోలు విషయంలో అమెరికా హెచ్చరికలను భారత్‌ ఏ మాత్రం లెక్కచేయకపోగా రష్యా, చైనాలకు మరింత దగ్గర అవుతుండటంతోనే అమెరికా పాక్‌ను సక్కన ఎత్తుకుంటుందని నిపుణులు అంటున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *