మరి ఈ మెగా బ్రదర్స్ ఏం చేయబోతున్నారు..? చిరంజీవి జోరును కుర్ర హీరోలు కూడా తట్టుకోలేకపోతున్నారు. ఆల్రెడీ సంక్రాంతికి అనిల్ రావిపూడి సినిమాతో రాబోతున్నారు.. సమ్మర్‌లో విశ్వంభర రానుంది.. శ్రీకాంత్ ఓదెల సినిమా అనౌన్స్ అయింది. అంతలోనే బాబీతో ప్రాజెక్ట్ సెట్ చేసారు మెగాస్టార్. వాల్తేరు వీరయ్య తర్వాత మరోసారి పూనకాలు పుట్టించాలని ఫిక్సైపోయారు ఈ జోడీ. చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో రాబోయే మెగా 158 సినిమా నేపథ్యంపై ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి. ఇది గ్యాంగ్ స్టర్ డ్రామా అని తెలుస్తుంది. పూర్తిగా మాఫియా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో చిరు గ్యాంగ్ స్టర్ పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తుంది. గతంలో ఈ తరహా కథల్లో నటించారు మెగాస్టార్. మొన్నటి గాడ్ ఫాదర్‌లోనూ చిరు డాన్‌గానే కనిపించారు. మెగా హీరోలు వరసగా మాఫియా కథల వైపే వెళ్తున్నారు. పుష్ప ప్రపంచం అంతా ఎర్రచందనం చుట్టూ తిరిగితే.. పవన్ కళ్యాణ్ OGలో గ్యాంగ్‌స్టర్‌గా నటించారు. ఆ మధ్య వరుణ్ తేజ్ మట్కాలో ఈ తరహా కథలోనే నటించారు. ఇప్పుడు చిరు సైతం మాఫియా వైపు అడుగులేస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి తమ్ముడి దారిలో అన్నయ్య వెళ్తున్నారిప్పుడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Lokesh Kanagaraj: కూలీతో అడ్డంగా బుక్ అయిపోయిన లోకేష్.. అందరికి టార్గెట్ అతడే
Kantara: ఎవరూ ఊహించని వివాదం లో కాంతార.. దానికి కారణం ఇదే
రికార్డ్ స్థాయిలో OG రిలీజ్.. వేచి చూస్తున్న కొత్త రికార్డులు
నీరుకొండపై 600 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం
ఫస్ట్ టైమ్ రైలు పై నుంచి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం