పవన్‌ కల్యాణ్‌కు ప్రియురాలిగా, బాలయ్యకు చెల్లెలిగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా? ఇప్పుడు టీచర్‌గా..

పవన్‌ కల్యాణ్‌కు ప్రియురాలిగా, బాలయ్యకు చెల్లెలిగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా? ఇప్పుడు టీచర్‌గా..


పవన్ కల్యాణ్- బాలకృష్ణ.. సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ దూసుకుపోతున్నారు ఈ టాలీవుడ్ స్టార్ హీరోలు. పవన్ కల్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తుంటే బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ ఇటీవలే ఓజీ సినిమాతో మన ముందుకు వచ్చారు. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా రూ. 200 కోట్ల కు పైగానే వసూళ్లు సాధించింది. పవన్ కల్యాణ్ కెరీర్ లోనే ఓజీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే ఓజీ రిలీజ్ కావాల్సిన రోజే బాలకృష్ణ అఖండ 2 కూడా రిలీజ్ కావాల్సింది. అయితే వీఎఫ్‌ఎక్స్ పనులు ఇతర కారణాలతో డిసెంబర్ కు వాయిదా పడింది. లేదంటే ఈ దసరాకు పవన్, బాలయ్య సినిమాల సందడి ఓ రేంజ్ లో ఉండేది. బాలకృష్ణ, పవన్ కల్యాణ్ తమ సినిమా కెరీర్ లో ఎంతో మంది హీరోయిన్లతో కలిసి నటించారు. శ్రియలాంటి సీనియర్ హీరోయిన్లు అయితే ఈ హీరోలిద్దరితోనూ రొమాన్స్ చేశారు. అయితే పవన్ కల్యాణ్ కు ప్రియురాలిగా నటించిన ఓ హీరోయిన్ ఆ తర్వాతి కాలంలో బాలయ్యకు సోదరిగా నటించింది. అంతే కాదు మహేష్ బాబు, ఎన్టీఆర్ లకు తల్లిగానూ యాక్ట్ చేసింది. ఈ హీరోయిన్ ఇప్పుడు పెద్దగా సినిమాలు చేయట్లేదు కానీ.. టీచర్ గా పిల్లలకు పాఠాలు చెబుతూ బిజి బిజీగా ఉంటోంది. మరి ఆ హీరోయిన్ ఎవరో తెలుసా? తను మరెవరో కాదు దేవయాని.. అదేనండి.. పవన్ కల్యాణ్ నటించిన సుస్వాగతం సినిమా హీరోయిన్ దేవయాని.

ఇవి కూడా చదవండి

సుస్వాగతంలో పవన్ కు లవర్ గా నటించి మెప్పించింది దేవయాని. అయితే దీని తర్వాత తెలుగులో పెద్దగా సినిమాలు చేయలేదీ అందాల తార. అయితే సెకెండ్ ఇన్నింగ్స్ లో చెన్నకేశవ రెడ్డి సినిమాలో బాలయ్య బాబుకు చెల్లెలిగా చేసింది దేవయాని. ఆ తర్వాత నాని సినిమాలో మహేష్ బాబుకు తల్లిగా నటించింది. ఇక జనతా గ్యారేజ్ సినిమాలో మోహన్ లాల్ భార్యగా, ఎన్టీఆర్ పెద్దమ్మగా నటించింది దేవయాని. అదే ఎన్టీఆర్‌కు అరవింద సమేత సినిమాలో తల్లిగా నటించిందీ అందాల తార. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అడపాదడపా మాత్రమే సినిమాల్లో నటిస్తోంది.

దేవయాని లేటెస్ట్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *