పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన చిత్రం ‘ఓజీ’. గురువారం వరల్డ్‌వైడ్‌గా విడుదలైన ఈ చిత్రం.. ప్రీమియర్స్ నుంచి హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ మూవీలో ప్రియా అరుళ్ మోహన్ హీరోయిన్ గా.. బాలీవుడ్ సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీ విలన్‌గా కనిపించాడు. అలాగే అర్జున్ దాస్, శ్రేయా రెడ్డి, వెంకట్, ప్రకాశ్ రాజ్, శుభలేఖ సుధాకర్, రావు రమేష్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్, వెన్నెల కిశోర్, మైమ్ గోపీ కీలక పాత్రల్లో నటించారు. తమన్ సంగీతం అందించాడు. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో తమన్ అదరగొట్టాడనే చెప్పాలి. ఇది ఇలా ఉంటే.. ఈ చిత్రం గురించి పలు ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి.
ముఖ్యంగా ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించేందుకు పెద్ద పెద్ద స్టార్ నటీనటులను అనుకున్నారట మేకర్స్. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, మోహన్ లాల్, టబు, టోవినో థామస్ లాంటి నటులను తీసుకోవాలనుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల ఈ క్యాస్టింగ్ కుదరలేదు. మరీ ముఖ్యంగా విలన్ రోల్ కోసం మొదట కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టిని నటింపజేయాలని చూశారట. కానీ ఆ కాంబినేషన్ సెట్ అవ్వలేదు. దీంతో చివరికి రేసులోకి బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ రావడం.. ఆయన ‘ఓమి’ క్యారెక్టర్‌కు బాగా సూట్ అవ్వడం జరిగింది. ఇక ఈ విషయం తెలిసిన అభిమానులు ఒకింత షాక్ అయ్యారు. ఒకవేళ రక్షిత్ శెట్టి విలన్‌గా చేసి ఉంటే.. బాక్సులు బద్దలయ్యావి అని కామెంట్స్ చేస్తున్నారు.
You may call him a Firestorm.
You may call him a Hungry Cheetah.But the Box Office has only one name for him – THE DESTRUCTOR 🔥🔥🔥#BoxOfficeDestructorOG #OG #TheyCallHimOG pic.twitter.com/VK4FgG6JAh
— DVV Entertainment (@DVVMovies) September 25, 2025