పర్యాటకులకు స్వర్గంలాంటి ఈ రాష్ట్రంలో మనుషులకంటే పాములే ఎక్కువ..ఎక్కడో కాదు మన దేశంలోనే..

పర్యాటకులకు స్వర్గంలాంటి ఈ రాష్ట్రంలో మనుషులకంటే పాములే ఎక్కువ..ఎక్కడో కాదు మన దేశంలోనే..


పాములకు భయపడని వారు చాలా తక్కువ. అయితే భారతదేశంలో ఒక రాష్ట్రం ఉంది. అక్కడ, పాములు విచ్చలవిడిగా రోడ్లపై తిరుగుతుంటాయి. ఇళ్లలోకి కూడా ప్రవేశిస్తూ కనిపిస్తాయి. ఇది అందమైన బీచ్‌లు, సహజ సౌందర్యానికి ప్రసిద్ధి చెందిన రాష్ట్రం. కానీ, ఆశ్చర్యకరంగా ఇక్కడ మన దేశంలోనే అత్యధిక సంఖ్యలో పాముల జాతులు కనిపిస్తాయి. ఈ రాష్ట్రం పర్యాటకులకు మాత్రమే కాదు, పాములకు కూడా స్వర్గధామం. దేశంలో అత్యధిక సంఖ్యలో పాముల జాతులు ఉన్న ఈ రాష్ట్రం మానవులకు ఇష్టమైన పర్యాటక ప్రదేశం మాత్రమే కాదు, పాములకు స్వర్గధామం కూడా. ఆ రాష్ట్రం ఏది..? పూర్తి డిటెల్స్‌ ఇక్కడ చూద్దాం..

కేరళలో దాదాపు 350 రకాల పాములు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో పాముల సంఖ్య పెరగడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. వాతావరణం, అధిక వర్షపాతం, దట్టమైన అడవులు పాములకు అనువైన ఆవాసాలను అందిస్తాయి. దీనివల్ల అనేక రకాల పాములు ఇక్కడ జీవించడానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే, ఇక్కడి జీవవైవిధ్యం పాములకు అవసరమైన ఆహారం, ఆవాసం, అవి దాక్కునేందుకు సరైన ప్రదేశాలు ఉన్నాయి.

కేరళ స్థానికులు తరచుగా కోబ్రాలను, మండల పాములను చూస్తారు. ఈ ప్రాంతంలో పాములు, మానవులు కలిసి జీవించడం వలన తరచుగా ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా పాములు కనిపిస్తాయి. అయితే, ఇక్కడి ప్రజలు వాటిని చూసినప్పుడు జాగ్రత్తగా ఉంటారు. ప్రమాదవశాత్తు ఎవరైనా పాము కాటుకు గురైతే మెరుగైన చికిత్సలు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ ఇవైద్య సౌకర్యాలు బాగుంటాయి.

గాడ్స్‌ ఓన్‌ కంట్రీగా పేరొందిన కేరళ ప్రకృతి అందాలకు కేరాఫ్‌ అండ్రస్‌గా నిలుస్తున్నది. ఇందుకు రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది, దాని అద్భుతమైన ప్రకృతి సౌందర్యం. పచ్చని పర్వతాలు, బ్యాక్ వాటర్స్, అందమైన బీచ్‌లు, దట్టమైన అడవులతో కేరళ స్వర్గంలా కనిపిస్తుంది. ఈ భూమిని దేవుడే సృష్టించాడని చెప్పే పురాణాలు కూడా ఉన్నాయి. రెండవది 1980లలో కేరళ పర్యాటక బోర్డు చేపట్టిన విజయవంతమైన మార్కెటింగ్ ప్రచారం. ఈ నినాదం పర్యాటకులకు కేరళ సహజ సౌందర్యాన్ని పరిచయం చేయడానికి ఎంతగానో దోహదపడింది. ఆ తర్వాత, ఇది ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందింది. ఈ రెండు కారణాల వల్ల కేరళకు దేవభూమి అనే పేరు వచ్చింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *