ఫోన్లో గరుడ పురాణం, శివ పురాణం వింటూ నేర్చుకున్నాడు. యోగాసనాలు వేస్తాడు. 24 ఏళ్ల వయసులో సొంతూరు విడిచి ఎల్లమ్మ ఆలయం కొండపైకి చేరుకున్నాడు. అక్కడే చిన్న పాక వేసుకుని ఉండటం మొదలుపెట్టాడు. కొండపై చెట్లు, మొక్కల ఆకులను కోతులు తినడాన్ని చూసి తానూ అలాగే అలవాటు చేసుకున్నాడు. తెల్లవారుజామున 3 గంటలకు నిద్ర లేవడంతో అతని రోజు ప్రారంభమవుతుంది. లేచింది మొదలు అడవిలోని కొండలు, చెట్లు ఎక్కుతూ ఆకుకూరలు తిని, అక్కడి నదుల్లో నీటిని తాగుతూ జీవిస్తున్నాడు. రోజుకు కనీసం రెండు సార్లు తప్పకుండా యోగా చేస్తాడు. జంతువులు ఆకులు తింటూ బతకగా లేనిది తానెందుకు బ్రతకలేననే ఆలోచన రావడంతో ఈ విధంగా సాత్విక జీవనం గడుపుతున్నాడు. ఈ పదేళ్లలో బుడాన్ అస్సలు అనారోగ్యంతో బాధపడలేదు. బరువు 60 కిలోలకు తగ్గకుండా, పెరగకుండా చూసుకుంటున్నాడు. దుస్తులు, వస్తువుల కోసం డబ్బు అవసరమైనప్పుడు మాత్రం సమీప గ్రామంలోకి వెళ్లి పనులు చేస్తుంటాడు. అతడిని పరీక్షించిన వైద్యులు కూడా ఆరోగ్యంగా ఉండడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. యోగా గురు రాందేవ్ బాబా సైతం బుడాన్ ఆహార పద్ధతులను, జీవన విధానాన్ని తెలుసుకుని ప్రశంసించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ రాష్ట్రంలో మనుషుల కంటే పాములే ఎక్కువ !! ఎందుకంటే
టవర్ లేకుండానే ఇకపై ఇంటర్నెట్.. ఇస్రో నెక్స్ట్ లాంచ్ టార్గెట్ అదే
ఫోన్ కాల్స్ డిస్టర్బ్ చేస్తున్నాయా ?? సింపుల్ టిప్స్.. ఇలా చేయండి
వామ్మో! టన్ను బరువున్న గుమ్మడికాయ ఎలా పండించారంటే
‘ఆట్రోవర్ట్’ లక్షణాలు మీలో ఉన్నాయా? అలాంటి వారే ఇలా ఉంటారట..!