పచ్చి కొబ్బరి చట్నీని పల్లెటూర్లలో బాగా చేసుకుని తింటారు. ఇది ఉప్మా, ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోతుంది.పచ్చిమిర్చి, అల్లం, చింతపండును వాడి ఈ కొబ్బరి పచ్చడిని తయారు చేస్తారు.
కావాల్సిన పదార్ధాలు : 150 గ్రాముల పచ్చి కొబ్బరి , 50 గ్రాముల పచ్చిమిర్చి, పెద్ద అల్లం ముక్కలు , 3 టేబుల్ స్పూన్ల శనగపప్పు పప్పు, నిమ్మకాయంత చింతపండు, రుచికి తగినంత ఉప్పును తీసుకోవాలి.
మిక్సీ జార్ లో కానీ, రోటిలో కానీ కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి వేసి బాగా దంచుకోవాలి. అలాగే అల్లం, శనగపప్పు , కొద్దిగా చింతపండు, రుచికి సరిపడా ఉప్పు వేసి, రెండు గ్లాస్ లు నీళ్లు పోసి మెత్తగా అయ్యేలా వాటిని పట్టుకోవాలి.
గ్యాస్ వెలిగించి పొయ్యి మీద పాన్ పెట్టి ఆయిల్ వేసి అది వేడయ్యాక అర టీ స్పూన్ ఆవాలు, కరివేపాకు ఆకులు , నాలుగు ఎండుమిర్చిని వేసి వాటిని బాగా వేయించాలి. ఈ వేడి పోపును కొబ్బరి పచ్చడి మిశ్రమంలో చట్నీలో వేసి వాటిని మిక్స్ అయ్యేలా బాగా కలపాలి.
కొబ్బరి పచ్చడి మరింత టేస్టీగా ఉండాలంటే దానిలో వెల్లుల్లి పేస్ట్, పల్లీలు వేసుకుంటే నోటికి మంచి రుచి తగులుతుంది. గట్టి చట్నీ కాకుండా చిక్కగా రావాలంటే నీళ్లు కొంచం పోస్తే సరిపోతుంది. దీని వలన రెండు దోసెలు, రెండు ఇడ్లీలు తినే వాళ్ళు మూడు ప్లేట్స్ లాగిస్తారు.




