
కోలీవుడ్ అగ్ర తారలు రజినీకాంత్, కమల్ హాసన్ నాలుగు దశాబ్దాల తర్వాత ఒక సినిమా కోసం మళ్లీ కలిసి నటిస్తున్నారు. ఈ క్రేజీ మల్టీస్టారర్‌కు సంబంధించి అధికారికంగా ప్రకటన వెలువడింది. షూటింగ్, విడుదల విషయంలో మేకర్స్ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఎంతో మంది దర్శకుల పేర్లు పరిశీలించిన తర్వాత, ఈ గోల్డెన్ ఛాన్స్ నెల్సన్ దిలీప్‌కుమార్‌కు దక్కింది. ప్రస్తుతం రజినీకాంత్ హీరోగా ‘జైలర్ 2’ను రూపొందిస్తున్న నెల్సన్, ఆ సినిమా పూర్తయిన వెంటనే, ఈ అక్టోబర్‌లో మల్టీస్టారర్‌ను పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. భారీ స్టార్ కాస్ట్, పెద్ద బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రికార్డ్ సమయంలో పూర్తి చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే, వచ్చే ఏడాది దీపావళికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు.