Headlines

పంట పొలంలో ఉన్నట్టుండి ఏర్పడిన 20 అడుగుల భారీ గొయ్యి.. దగ్గరకు వెళ్లి చూడగా

పంట పొలంలో ఉన్నట్టుండి ఏర్పడిన 20 అడుగుల భారీ గొయ్యి.. దగ్గరకు వెళ్లి చూడగా


ప్రశాంతంగా ఉన్న పంట పొలాల్లో ఒక్కసారిగా భారీ గొయ్యి ప్రత్యక్షం కావడంతో రైతులు, గ్రామస్థులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. కడప నగరానికి సమీపంలోని కాజీపేట మండలం, చెముళ్లపల్లి గ్రామ పరిధిలోని సి.కొత్తపేట పొలాల్లో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. సి.కొత్తపేట గ్రామ రైతులు ఎప్పటిలాగే పనులు చేసుకునేందుకు తమ పొలాలకు వెళ్లారు. అలా వెళ్లిన వారికి తమ పొలంలో ఒక పెద్ద గుంత కనిపించింది. ఉన్నట్టుండి విచిత్రంగా పొలంలో పెద్ద గుంత కనిపించడంతో షాక్‌కు గురయ్యారు. సుమారు రెండున్నర అడుగుల వెడల్పు ఉన్న ఈ గొయ్యి, దాదాపు 15 నుండి 20 అడుగుల లోతు వరకు ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ గొయ్యి అడుగు భాగంలో నీరు కనిపిస్తోంది. సాధారణంగా భూమి కుంగిపోవడం వంటి ఘటనలు అడపాదడపా విన్నా.. ఇంత లోతైన గొయ్యి పడటం స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గతంలో అక్కడ బావి తవ్వడం వల్ల భూమి కుంగిపోయిందా? లేక భూగర్భంలో మార్పుల వల్ల ఈ గొయ్యి ఏర్పడిందా? అనే కోణంలో విచారణ చేపట్టారు. అయితే, ఖచ్చితమైన కారణాలు తెలుసుకోవడం కోసం అక్కడి మట్టి నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపించారు. ఉన్నట్టుండి భూమిలో ఇంత పెద్ద రంధ్రం పడటంతో, సాగు పనులకు వెళ్లాలంటేనే రైతులు జంకుతున్నారు. భూసారం తగ్గి ఇలా జరిగిందా లేక మరేదైనా కారణమా అని చర్చించుకుంటున్నారు. అధికారులు క్లారిటీ ఇచ్చే వరకు ఆ ప్రాంతానికి ఎవరూ వెళ్లవద్దని స్థానికులు నిర్ణయించుకున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Viral Video: రివర్స్ గేర్.. పామునే నోటకరిచిన కప్ప !! ప్రకృతి వైపరీత్యం

Walking: భోజనం చేసిన వెంటనే నడవడం మంచిదా.. కాదా..?



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *