ఇందులో ఓ వ్యక్తి తాను ఆహారం లేకుండా జీవిస్తున్నానని, 7-8 లీటర్ల వేస్ట్ ఇంజిన్ ఆయిల్ మరియు టీ మాత్రమే తింటున్నానని చెప్పడంతో ప్రపంచ ఆరోగ్య నిపుణులకు ఒక రహస్యమైన కేస్ స్టడీగా మారాడు. వైద్యులు, శాస్త్రవేత్తలు అతని మాటలు, జీవనశైలిని చూసి షాక్ అయ్యారు. 33 ఏళ్ల ఆ వ్యక్తి ఇప్పటికీ ఫిట్‌గా ఉండటానికి గల కారణాన్ని స్పష్టం చేయలేకపోతున్నారు. కర్ణాటకలోని శివమొగ్గకు చెందిన ఈ వ్యక్తి ఆయిల్ కుమార్‌గా స్థానికంగా ఫేమస్ అయిపోయారు. అయ్యప్ప భగవంతుని ఆశీస్సుల వల్లే ఈ ప్రత్యేకమైన జీవనశైలి సాధ్యమవుతుందని అన్నారు.ఆయిల్ కుమార్ ఆహారం లేకుండా జీవిస్తాడు. అన్నం, చపాతీకి బదులుగా, అతను రోజువారీ 7-8 లీటర్ల వేస్ట్ ఇంజిన్ ఆయిల్ తాగుతూ జీవిస్తున్నాడు. కర్ణాటకలో సాధువు రూపంలో నివసిస్తున్న ఆయిల్ కుమార్ మోటార్ ఆయిల్ తాగుతూ సంతోషంగా జీవిస్తున్నాడు. అతను ఇప్పటివరకు ఆసుపత్రికి వెళ్లలేదు. ఎటువంటి వైద్య సహాయం అవసరం పడలేదు. ఆరోగ్యకరమైన జీవనశైలిని గడుపుతున్నాడని కూడా నివేదికలు చెబుతున్నాయి. ఆయిల్ కుమార్ కథ కర్ణాటకలోనే కాకుండా భారతదేశంలో అత్యంత చర్చనీయాంశమైన వైద్య రహస్యాలలో ఒకటిగా మారింది
మరిన్ని వీడియోల కోసం :