
షణ్ముఖ్ జశ్వంత్.. ఒకప్పుడు సోషల్ మీడియాలో ఈ పేరు చాలా పాపులర్. హీరో రేంజ్లో ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ ద్వారా యూట్యూబ్ స్టార్ గా పాపులర్ అయ్యాడు. షణ్ముఖ్ చేసిన ప్రతి షార్ట్ ఫిల్మ్ కొన్ని మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోయాయి. కానీ కొన్ని నెలలుగా అడియన్స్ ముందుకు రాలేకపోయాడు షణ్ముఖ్. తెలుగులో అత్యధిక సబ్ స్క్రయిబర్స్ కలిగిన మొదటి యూట్యూబర్ గా రికార్డ్ సెట్ చేసుకున్న షణ్ముఖ్. షణ్ముఖ్ జస్వంత్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టి మరింత క్రేజ్ సొంతం చేసుకున్నాడు. టైటిల్ ఫేవరెట్‌గా కనిపించినప్పటికీ కొన్ని కారణాలతో రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. కాగా బిగ్‌బాస్ హౌస్‌లో షణ్ముఖ్ సిరి హన్మంత్‌తో వ్యవహరించిన తీరు చాలామందిని విస్మయపరిచింది. అప్పటికే దీప్తి సునైనాతో రిలేషన్‌షిప్‌లో ఉన్న జస్వంత్ బిహేవియర్‌పై అతని ఫ్యాన్స్ కూడా విమర్శలు గుప్పించారు. దీనికి నొచ్చుకున్న దీప్తి కూడా తమ సుదీర్ఘ బంధానికి పుల్‌స్టాప్ పెడుతూ షణ్ణూకు బ్రేకప్ చెప్పేసింది. ఆతర్వాత ఈ ఇద్దరూ ఎవరి దారిలో వారు బిజీగా ఉన్నారు. షణ్ముఖ్ పలు వివాదాల్లో చిక్కుకున్నాడు. దీప్తి సునైనా పెద్దగా ఎక్కడ కనిపించడం లేదు.
ఇక ఇటీవలే షణ్ముఖ్ ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. దీప్తితో బ్రేకప్ తర్వాత మళ్లీ ప్రేమలో పడ్డాడు షణ్ముఖ్. కొన్ని రోజుల క్రితం ఫేస్ చూపించకుండా ఒక అమ్మాయిని పరిచయం చేసాడు.. ఇప్పుడు ఏకంగా ఎంగేజ్మెంట్ చేసుకుని ఫ్యాన్స్ కు సూపర్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఫిబ్రవరి 25 ప్రేయసి వైష్ణవి చోడిశెట్టి అనే అమ్మాయిని నిశ్చితార్థం చేసుకున్నాడు షణ్ముఖ్ . త్వరలోనే వీరి వివాహం కూడా జరగనుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో షణ్ముఖ్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. బ్రేకప్ సమయంలో చాలా బాధపడ్డా అని తెలిపాడు. ఆ అమ్మాయి గురించి కూడా ఆలోచించాలి కదా.. నా వల్ల తనకు, ఎవరికీ బ్యాడ్ నేమ్ రాకూడదని అనుకున్నాను.. ఎప్పుడూ ఎప్పుడూ ఎందుకు బ్రేకప్ చెప్పావ్..? అని ఒత్తిడి చేయలేదు అని తెలిపాడు.
నేను బెస్ట్ ఎక్స్ బాయ్‌ఫ్రెండ్‌ని.. బ్రేకప్ తర్వాత ఎవ్వరిని ఇబ్బందిపెట్టలేదు. ఎవ్వరినీ టార్చర్ చేయలేదు. నా పని నేను చేసుకున్నా.. ఎప్పుడైనా బాధ అనిపిస్తే ఫోన్ లో ఫొటోలు చూసుకోవడమే చేస్తా అని తెలిపాడు షణ్ముఖ్. బ్రేకప్ తర్వాత ప్రేమపై నమ్మకంపోయింది. ఆ సమయంలోనే వైష్ణవి వచ్చింది. ఆమెకు దైవభక్తి ఎక్కువ వచ్చింది. అయితే ప్రేమలాంటివి కాకుండా డైరెక్ట్‌గా పెళ్లి ప్రపోజల్ పెట్టాను.. నా చేతి మీద పచ్చబొట్టు చూసి అది మీకో మెమొరీ. ఉంచాలనుకుంటే ఉంచుకోవచ్చు. లేదంటే తీసెయ్యొచ్చు అని చెప్పిందట.. ఇప్పటివరకు తనను పేరు పెట్టి పిలవలేదని చెప్పుకొచ్చాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి