బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం అందుకోలేకపోయింది. దీంతో ఈ సినిమా రెమ్యూనరేషన్‌ను నిర్మాతలకు రిటర్న్ ఇచ్చినట్లు సిద్ధు తాజాగా ఇంటర్వ్యూలో చెప్పారు. సిద్ధూ తాజాగా ఓ యూట్యూబ్ పాడ్ కాస్ట్‌లో ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసారు. తన వల్ల ఎవరు కూడా నష్టపోకూడదనే ఉద్దేశంతో.. అప్పుచేసి మరీ తాను తీసుకున్న రెమ్యూనరేషన్ రూ.4.75 కోట్లు మేకర్స్‌కి వాపస్ ఇచ్చేశాననీ అన్నారు. ఆ అప్పును వీలైనంత త్వరగా తీర్చేసేపనిలో ఉన్నానని సిద్ధు అన్నారు. అయితే.. రెమ్యూనరేషన్ వాపసు ఇవ్వడం ఈ రోజుల్లో ఉండస్ట్రీలో కొత్తేం కాదు. నిజానికి సినిమా ఫలితంతో హీరోలకు సంబంధం ఉండదు. సినిమా ఫ్లాప్ అయితే తీసుకున్న రెమ్యూనరేషన్ వెనక్కి ఇవ్వాలనే రూల్ కూడా ఏమీ లేదు. కానీ, నిర్మాత నష్టపోకూడదనే ఉద్దేశంతో.. తన దగ్గర డబ్బు లేకపోయినా, లోన్ తీసుకొని మరీ మేకర్స్‌కి ఇవ్వడం సిద్ధు గొప్పతనమని అభిమానులు చెబుతున్నారు. అయితే కానీ తమపై నమ్మకంతో నిర్మాతలు భారీ బడ్జెట్ పెట్టుబడిగా పెట్టితే వాళ్లను నష్టాల్లో చూడలేక మన హీరోలు ఇలా రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేసి నిర్మాతలకు తమవంతుగా సాయం చేస్తున్నారు. తెలుగు ఫిల్మ్ ఇండిస్ట్రీలో లెక్కల మీద కంటే.. నమ్మకం మీదనే నిర్మాతలు సినిమాలు చేస్తారని, ఇది మన పరిశ్రమ గొప్పతనం అని సిద్ధూ అన్నారు. గతంలో నిర్మాతలు నాగవంశీ, విశ్వతో రూ.50 కోట్లు బడ్జెట్ సినిమాలకు పనిచేసినా.. ఏనాడూ ఎలాంటి అగ్రిమెంట్లు చేసుకోలేదని చెప్పారు. కేవలం వారిద్దరి మీద నమ్మకం వల్లనే అది సాధ్యమైందని అన్నారు. ‘తెలుసు కదా’ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు సిద్ధూ. సిద్ధూ లీడ్ రోల్లో ఈ సినిమా అక్టోబర్ 17న రిలీజ్ కానుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దసరా ఆఫర్.. మరింత తగ్గిన ‘మిరాయ్’ టికెట్ ధర
అక్టోబర్‌లో బ్యాంక్ హాలిడేస్ 19 రోజులు
ఈ ఆటో రిక్షా కుర్రాడి సంపాదన నెలకు రూ.లక్ష
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్ఫూర్తిదాయక నిర్ణయం
రన్నరప్ చెక్ ను స్వీకరించి విసిరేసిన పాక్ కెప్టెన్