ఈ మేరకు షార్ట్ నోటీస్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ కింద దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే రీజియన్లలో మొత్తం 8 వేల 875 రైల్వే పోస్టులను భర్తీ చేయనుంది. ఇందుకు సంబంధించిన వివరణాత్మక సెంట్రలైజ్డ్ ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్ త్వరలో విడుదల చేయనుంది. నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ కింద మొత్తం ఖాళీలను భర్తీ చేయడానికి ఆమోదించినట్లు తన ప్రకటనలో పేర్కొంది. మొత్తం పోస్టుల్లో 5వేల 817 గ్రాడ్యుయేట్ లెవెల్, 3వేల 58 పోస్టులు అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉన్నాయి. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ రిక్రూట్మెంట్లోని గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టుల్లో అత్యధికంగా గూడ్స్ రైలు మేనేజర్ పోస్టులు 3వేల 423 వరకు ఉన్నాయి. జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్-కమ్-టైపిస్ట్ పోస్టులు 921, స్టేషన్ మాస్టర్ పోస్టులు 615, సీనియర్ క్లర్క్-కమ్-టైపిస్ట్ పోస్టులు 638, చీఫ్ కమర్షియల్-కమ్-టికెట్ సూపర్వైజర్ పోస్టులు 161, మెట్రో రైల్వేలో ట్రాఫిక్ అసిస్టెంట్ పోస్టులు 59 వరకు ఉన్నాయి. ఇక అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టుల్లో అత్యధికంగా కమర్షియల్-కమ్-టికెట్ క్లర్క్ పోస్టులు 2 వేల 424 వరకు ఉన్నాయి. అకౌంట్స్ క్లర్క్-కమ్-టైపిస్ట్ పోస్టులు 394, జూనియర్ క్లర్క్-కమ్-టైపిస్ట్ పోస్టులు 163, రైళ్ల క్లర్క్ పోస్టులు 77 వరకు ఉన్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సినీ రంగంలోకి హీరో సూర్య కూతురు!
ఐటీ ఉద్యోగులు ఎగిరి గంతేసే వార్త..
పురానాపూల్లో నీటమునిగిన శివాలయం.. వరదలో చిక్కుకున్న పూజారి కుటుంబం
సౌత్ ఇండస్ట్రీలో క్రేజీ సినిమాల క్యూ
కమ్ బ్యాక్ కోసం చూస్తున్న డైరెక్టర్స్