నాలుగేళ్ళ కష్టం వర్సెస్ ఆర్నెళ్ల అదృష్టం.. ఏది గెలుస్తుంది

నాలుగేళ్ళ కష్టం వర్సెస్ ఆర్నెళ్ల అదృష్టం.. ఏది గెలుస్తుంది


ఒకరిదేమో నాలుగేళ్ల కష్టం.. మరొకరిదేమో ఆర్నెళ్ల శ్రమ..! అన్నేళ్లు కష్టపడిన హీరో సినిమాపై ఎంత క్రేజ్ ఉందో.. కొన్నినెలల ముందు వచ్చిన క్రేజ్‌తో మరో సినిమాపై అంతకంటే ఎక్కువ హైప్ వచ్చేసింది. ఇప్పుడు ఈ రెండు సినిమాలు ఒకేరోజు విడుదల కానున్నాయి. మరి ఈ నాలుగేళ్ల కష్టం గెలుస్తుందా.. ఆర్నెళ్ల సినిమాను అదృష్టం వరిస్తుందా..? చూద్దామా డీటైల్డ్‌గా.. ఈ మధ్య మన హీరోలకు కథ నచ్చితే చాలు.. ఒకే సినిమా కోసం మూడు నాలుగేళ్ళు రాసిచ్చేస్తున్నారు. కన్నడలో యశ్ కూడా టాక్సిక్ కోసం ఇదే చేస్తున్నారు. కేజియఫ్ కోసం ఐదేళ్ళు తీసుకుంటే.. టాక్సిక్ కోసం నాలుగేళ్లకు పైగానే డేట్స్ ఇచ్చారు యశ్. మార్చి 19న విడుదల కానుంది ఈ చిత్రం. దీనిపై అంచనాలు నెక్ట్స్ లెవల్‌లో ఉన్నాయి. టాక్సిక్ వస్తున్న అదేరోజు ధురంధర్ 2 కూడా రానుంది. టాక్సిక్ కోసం యశ్ నాలుగేళ్లుగా కష్టపడుతుంటే.. ఆర్నెళ్ళ గ్యాప్‌తో అదరగొడుతున్నాడు ధురంధర్. డిసెంబర్‌లో విడుదలైన ధురంధర్ ఏకంగా 1400 కోట్లకు పైనే కలెక్ట్ చేసింది. దాంతో పార్ట్ 2పై అంచనాలు అలా అలా పెరిగిపోయాయి. ఎంతగా అంటే.. నాలుగేళ్ల టాక్సిక్ కష్టాన్ని కూడా డామినేట్ చేసేంతగా..! ముంబైలో షూటింగ్ లొకేషన్స్ విషయంలో కాంట్రవర్సీ రేగినా.. అనుకున్న టైమ్‌కే ధురంధర్ 2 వస్తుందంటున్నారు మేకర్స్. సౌత్‌లోనూ ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరోవైపు టాక్సిక్‌పై నార్త్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ పీక్స్‌లో ఉన్నాయి. ఈ నార్త్ వర్సెస్ సౌత్ పోరులో ఎవరిది పై చేయి అవుతుందా అనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Vijay-Rashmika Marriage: 100 మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం ??

Roshan: లవ్ స్టోరీస్ మీద ఫోకస్ చేస్తున్న యంగ్ హీరో

Ajith: కన్‌ఫ్యూజ్ చేస్తున్న కోలీవుడ్ స్టార్ అజిత్

Mrunal Thakur: బాడీ షేమింగ్ చేశారంటూ బ్యూటీ ఆవేదన

Puri Jagannadh: బాలయ్యను డిఫరెంట్‌గా చూపించిన పూరి జగన్నాథ్‌



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *