తెలంగాణ రాష్ట్రం భారీ వర్షాల బారి నుండి తీవ్రంగా ప్రభావితమవుతోంది. వాతావరణ శాఖ తాజాగా జారీ చేసిన హెచ్చరిక ప్రకారం రానున్న నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ హెచ్చరిక రాష్ట్రంలోని ప్రజలను అప్రమత్తం చేసింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరాల ప్రకారం, వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం దాని అనుబంధ ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 7.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. గంగా తీర ప్రాంతాలు, ఉత్తర ఒడిశా, వాయువ్య బంగాళాఖాతం నుంచి తెలంగాణ మీదుగా ఒడిశా వరకు ఒక ద్రోణి విస్తరించి ఉంది. అంతేకాకుండా సెప్టెంబర్ 25న ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.
మరిన్ని వీడియోల కోసం :