నవరాత్రి ఉపవాసంలో PM మోదీ.. అయినా ఒకే రోజు 3 రాష్ట్రాల్లో పర్యటన!

నవరాత్రి ఉపవాసంలో PM మోదీ.. అయినా ఒకే రోజు 3 రాష్ట్రాల్లో పర్యటన!


న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దినచర్య గురువారం (సెప్టెంబర్‌ 25) బిజీగా గడిచింది. నవరాత్రి సందర్భంగా తొమ్మిది రోజులు ఉపవాసం ఉన్నప్పటికీ.. ఆయన ఒకే రోజు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ.. మూడు రాష్ట్రాలను సందర్శించారు. ఆయన బిజీ షెడ్యూల్ పని పట్ల ఆయనకున్న నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ప్రధాని మోదీ పర్యటన ఉత్తరప్రదేశ్‌తో ప్రారంభించారు. ఆ రాష్ట్రంలోని గ్రేటర్ నోయిడాలో ఉత్తరప్రదేశ్ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన 2025 ప్రధాని మోదీ చేతుల మీదగా ప్రారంభించారు. ఆ తర్వాత హెలికాప్టర్ ద్వారా ప్రధాని మోదీ రాజస్థాన్‌లోని బన్స్వారాకు చేరుకున్నారు. అక్కడ రూ.1,22,100 కోట్లకు పైగా విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, ప్రారంభించారు. PM-KUSUM పథకం లబ్ధిదారులతో కూడా ఆయన సంభాషించారు.

బన్స్వారాలోని పిఎం-కుసుమ్ యోజన లబ్ధిదారులతో మోదీ సంభాషణ

రాజస్థాన్‌లోని బన్స్వారాలో జరిగిన కార్యక్రమంలో PM-KUSUM పథకం లబ్ధిదారులతో ప్రధాని మోదీ సంభాషించారు. ఈ చొరవ వారి ఆదాయాన్ని గణనీయంగా పెంచిందని తెలుసుకుని తాను ఎంతో సంతోషించినట్లు తెలిపారు. ఈ సమయంలో వారు ప్రదర్శించిన విశ్వాసం మన పథకాల ప్రయోజనాలు ప్రజలకు నేరుగా చేరుతున్నాయనడానికి రుజువని ప్రధాన మంత్రి మోదీ సోషల్‌ మీడియా వేదికగా ఎక్స్‌ ఖాతాలో ట్వీట్ చేశారు.

ఒకే రోజులో 4.5 గంటల విమాన ప్రయాణం చేసిన విమానం

రాజస్థాన్‌లో తన కార్యక్రమాలను ముగించుకున్న తర్వాత, ప్రధాని మోదీ నేరుగా ఢిల్లీలోని భారత్ మండపానికి వెళ్లారు. అక్కడ ఆయన వరల్డ్ ఫుడ్ ఇండియా 2025ను ప్రారంభించారు. ఆహార ప్రాసెసింగ్, వ్యవసాయ, వ్యాపార రంగాలలోని వాటాదారులతో ఆయన సంభాషించారు. ప్రపంచ ఆహార భద్రతలో భారత్‌కు పెరుగుతున్న పాత్రను నొక్కి చెప్పారు. గురువారం రోజంతా ప్రధానమంత్రి 2 గంటల హెలికాప్టర్ ప్రయాణంతో సహా మొత్తం దాదాపు 4.5 గంటలు విమానంలో ప్రయాణించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *