ఇక్కడ హార్రర్ సినిమా దృశ్యం కనబడుతుంది. ఏమో జరిగిందనే కారణంతో జనం వణికిపోతున్నారు. రోడ్డు వెంట ఎక్కడ చూసిన ఇలాంటి పూజలు చేస్తున్న అనవాళ్లు కనిపిస్తున్నాయి. అర్థరాత్రి అయితే చాలు ఇలాంటి దృశ్యాలు కనబడుతున్నాయి. దీంతో ఇటు వైపు వెళ్లాలంటేనే జనం భయంతో వణికిపోతున్నారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలతో హడలెత్తిస్తున్నారు. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. స్థానిక మండల పరిషత్ ఆఫీసు మూల మలుపు చౌరస్తాలో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అన్నం ముద్దలకు పసుపు, కుంకుమ పట్టించి నిమ్మకాయలు, కొబ్బరికాయలు, కోడిని బలిచ్చారు. నడి రోడ్డుపై క్షుద్ర పూజలు చేశారు. ఆది, గురువారాల్లో క్షుద్ర పూజలు ఈ ప్రాంతంలో నిత్యకృత్యంగా మారాయి.
అయితే నివాస ప్రాంతాల్లో క్షుద్ర పూజలు చేయడం పట్ల స్థానికులు భయాందోళన గురవుతున్నారు. సాంకేతిక రంగం ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ ఈ కాలంలో కూడా ఇంకా మూఢనమ్మకాలను నమ్మొద్దని జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు అంటున్నారు. దీంతో చిన్న పిల్లలను ఇటు వైపు పంపించడం లేదు స్థానికులు. ప్రతి ఆది, గురు వరాల్లో ఇలాంటి భయంకర దృశ్యాలు కనబడుతున్నాయి.. ఇలాంటి పూజలు చేస్తున్నా వారి పై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..