
సాయుధ మిలిటెంట్ పోరాటపంథాలో ఒకప్పుడు బలంగా ఉన్న మావోయిస్టు పార్టీ ఇప్పుడు కకావికలమైంది. విప్లవ సాయుధ పోరాటపంథాలో వెళ్లిన మావోయిస్టులు – ఆపరేషన్ కగార్‌కు తలొగ్గారు. ఒకవైపు ఎన్కౌంటర్లు, మరోవైపు లొంగుబాటులో ఆ పార్టీ పోరాటం క్లైమాక్స్‌కి చేరింది. లొంగుబాట్ల క్రమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అగ్రనేతలే సరెండర్ అవుతున్నారు.
తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోయాయారు. ఇటీవల లొంగిపోయిన మావోయిస్ట్ కీలక నేత దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి గ్రూపులకు చెందిన PLGA కమిటీ మొత్తం సరెండర్ అయింది. అత్యాధునిక ఆయుధాలు 31 ఏకే47లతో పాటు 124 మంది మావోయిస్టులు పోలీసుల ముందు సరెండ్ అయ్యారు. దేశ చరిత్రలోనే అతిపెద్ద లొంగుబాటు అని పోలీసులు అంటున్నారు. మావోయిస్ట్‌ల లొంగుబాటుపై సీఎం ప్రకటన చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..