దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చిన జీఎస్టీ 2.o.. ఏ వస్తువుల ధరలు ఎంతెంత అంటే..

దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చిన జీఎస్టీ 2.o.. ఏ వస్తువుల ధరలు ఎంతెంత అంటే..


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కూడిన జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా అన్ని వర్గాల వారికి మేలు చేయనుంది. ఈ పన్ను రేట్ల హేతుబద్ధీకరణ వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు సుమారు రూ. 2 లక్షల కోట్ల అదనపు ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ కొత్త విధానంలో సామాన్యులు రోజూ వినియోగించే వస్తువులకు పెద్దపీట వేశారు. ముఖ్యంగా ఆహార పదార్థాలపై పన్ను భారం తగ్గించారు. ప్యాక్ చేసిన పాలు, పన్నీర్, చపాతీలు, పిజ్జా బ్రెడ్ వంటి వాటిపై పన్నును పూర్తిగా రద్దు చేశారు. గతంలో 18% పన్ను శ్లాబులో ఉన్న వెన్న, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, కాఫీ, ఐస్ క్రీమ్, జామ్‌లు, కెచప్‌లు, బిస్కెట్ల వంటి అనేక నిత్యావసర వస్తువులను 5% శ్లాబులోకి తీసుకొచ్చారు. పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, ఏసీల వంటి గృహోపకరణాలపై పన్నును 28% నుంచి 18% శాతానికి తగ్గించారు. చిన్న కార్లు, 350సీసీ లోపు మోటార్‌ సైకిళ్లపై పన్ను 18%గా ఉంటుంది. పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాలపై కేవలం 5% పన్ను మాత్రమే విధించనున్నారు. ఆరోగ్య, జీవిత బీమా ప్రీమియంలపై పన్నును పూర్తిగా తొలగించారు. అత్యవసర మందులు, వైద్య పరికరాలపై 5% పన్ను వర్తిస్తుంది. పెన్సిళ్లు, పుస్తకాలు, మ్యాప్‌ల వంటి స్టేషనరీ వస్తువులపై పన్ను రద్దు చేశారు. అలాగే నిర్మాణ రంగానికి ఊతమిస్తూ సిమెంట్ మీద పన్నును 28% నుంచి 18 శాతానికి తగ్గించారు. రూ. 7,500 లోపు హోటల్ గదులు, ఎకానమీ విమాన టికెట్లపై 5% జీఎస్టీ ఉంటుంది. అదేవిధంగా జిమ్‌లు, స్పాలు, సెలూన్‌ల సేవలు కూడా చౌక కానున్నాయి. దసరా ,దీపావళి సందర్భంగా పన్ను రేట్లు తగ్గడంతో కొనుగోళ్లు భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విమానంలో ఎలుక.. కేకలు పెట్టిన ప్రయాణికులు

సూర్యుడిని రెండుగా చీలుస్తూ నింగికి ఎగిసిన ఫాల్కన్‌.. అదిరిపోయే ఫొటోను చూసారా



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *