కుటుంబాలతో వచ్చినా, జంటగా వచ్చినా, వ్యాపార పనుల మీద వచ్చినా అక్కడి అందాలను ఆస్వాదించవచ్చు. అయితే బహ్రెయిన్ సందర్శనకు వీసా అవసరం. భారతీయ పాస్ పోర్ట్ హోల్డర్లు వీసా లేకుండా బహ్రయిన్‌లోకి అనుమతించరు. వీసా పొందడానికి రెండు మార్గాలు ఉన్నాయి. అందులో ఒకటి ఈ-వీసా. దీన్ని ముందస్తుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. మరొకటి అర్హత ఉన్నట్లయితే విమానాశ్రయం వద్ద వీసా పొందే వీసా ఆన్ అరైవల్. రెండింటికీ చెల్లుబాటు అయ్యే పాస్ పోర్ట్, రిటర్న్ ఫ్లైట్ టికెట్, తగినంత నిధులు ఉండాలి. వీసాలు ౩ నుంచి 5 రోజుల్లో ప్రాసెస్ చేస్తారు. ఆన్-అరైవల్ వీసాలు మాత్రం అదే రోజు మంజూరు చేస్తారు. అయితే విజిటర్ వీసాపై అక్కడ ఉద్యోగం చేయడానికి మాత్రం అనుమతి ఉండదు. వీసా కోసం 1,168 రూపాయలు కడితే సరిపోతుంది. డిసెంబర్ నుంచి మార్చి వరకు బహ్రెయిన్ సందర్శనకు ఉత్తమ సీజన్. ఆ సమయంలో వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. జూలై, ఆగస్టు నెలల్లో, ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు వెళ్లకపోవడం మంచిది. రంజాన్, ఈద్ ప్రార్థనా సమయాలు మీ షాపింగ్ షెడ్యూల్ ను ప్రభావితం చేస్తాయి. బహ్రెయిన్ అధికారిక వీసా పోర్టల్ లో దరఖాస్తు చేయాలి. కొద్ది రోజుల్లో ఈమెయిల్ ద్వారా అప్రూవల్ వస్తుంది.
మరిన్ని వీడియోల కోసం :