దసరా రోజున జమ్మి చెట్టుని పూజిస్తే విధి మారుతుందనే నమ్మకం.. ఎందుకంటే

దసరా రోజున జమ్మి చెట్టుని పూజిస్తే విధి మారుతుందనే నమ్మకం.. ఎందుకంటే


దసరా లేదా విజయదశమిని హిందువులు జరుపుకునే అత్యంత పవిత్రమైన పండగలలో ఒకటిగా పరిగణిస్తారు. ఈ రోజున రాముడు రావణుడిని చంపడం ద్వారా ధర్మాన్ని రక్షించాడని నమ్మకం. అంతేకాదులోక కంటకుడైన మహిషాసురుడు ని దుర్గాదేవి సంహరించి లోక కళ్యాణం చేసిన రోజు అని విశ్వాసం. ఈ రోజు రావణ దహనం మాత్రమే కాదు. దసరా రోజున పాటించే మరో ప్రత్యేక సంప్రదాయం జమ్మి చెట్టును పూజించడం. జమ్మి చెట్టును పూజించడం ఆధ్యాత్మికంగా, పురాణాలు, జ్యోతిషశాస్త్రం అనే మూడు అంశాలలో అత్యంత శక్తివంతమైనది. ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది.

మహాభారత కథ ప్రకారం పాండవులతో ముడిపడిన జమ్మి చెట్టు పూజ

జమ్మి చెట్టు ప్రాముఖ్యత మహాభారత కాలం నాటిది. పాండవులు అజ్ఞాతవాసానికి బయలుదేరినప్పుడు వారు తమ ఆయుధాలన్నింటినీ జమ్మి చెట్టులో దాచిపెట్టారు. అజ్ఞాత వాసం ముగిసిన తర్వాత వారు తిరిగి వచ్చినప్పుడు.. వారి ఆయుధాలు చెక్కుచెదరకుండా ఉన్నాయి. దీని ఫలితంగా జమ్మి చెట్టు శక్తికి, విజయానికి చిహ్నంగా పరిగణించబడ్డాడు. అప్పటి నుంచి దసరా రోజున జమ్మి చెట్టుని పూజించి ఆయుధాలను పూజించే సమర్పించే సంప్రదాయం మొదలైంది. నేటికీ ఈ సంప్రదాయం కొనసాగుతూనే ఉంది.

జమ్మి ఆకులను ‘బంగారం’ అని ఎందుకు పిలుస్తారు?

దసరా నాడు జమ్మి ఆకులను ఇచ్చిపుచ్చుకునే సంప్రదాయం అనేక రాష్ట్రాల్లో ప్రబలంగా ఉంది. మహారాష్ట్ర , దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఈ ఆచారాన్ని “బంగారాన్ని పంచుకోవడం” అని పిలుస్తారు. జమ్మి ఆకులు నిజమైన బంగారం వలె పవిత్రమైనవని నమ్ముతారు. వీటిని ఇంట్లో ఉంచుకోవడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. సంపద, శ్రేయస్సు పెరుగుతుంది. అందుకే ప్రజలు దసరా రోజున జమ్మి ఆకులను ఇంటికి తీసుకువచ్చి ఇంట్లోని పూజ గదిలో లేదా ఎక్కడైనా భద్రంగా ఉంచుతారు.

ఇవి కూడా చదవండి

జమ్మి చెట్టు జ్యోతిషశాస్త్ర ప్రాముఖ్యత

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జమ్మి చెట్టు శనీశ్వరుడినికి ఇష్టమైనది. దసరా రోజున జమ్మి చెట్టును పూజించడం వల్ల శనీశ్వరుని ప్రతికూల ప్రభావాలు శాంతించి, వృత్తి , వ్యాపారంలో అడ్డంకులు తొలగిపోతాయి. జమ్మి చెట్టును క్రమం తప్పకుండా పూజించే వారు తమ జీవితంలో స్థిరత్వాన్ని పొందుతారని.. శత్రువులపై విజయం సాధిస్తారని చెబుతారు.

జమ్మి చెట్టుని పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు

శత్రువుల నుంచి, ఇబ్బందుల నుంచి విముక్తి.

శనీశ్వర దుష్ప్రభావాల నుంచి ఉపశమనం

ఇంట్లో ఆనందం, శాంతి, అదృష్టం పెరుగుతాయి.

సంపద , శ్రేయస్సు సముపార్జన

వృత్తి, వ్యాపారం, ఉద్యోగ రంగంల్లో విజయం

రాముడికి జమ్మి చెట్టుకి మధ్య సంబంధం

లంకలో రావణుడుపై విజయం కోసం రాముడు జమ్మి చెట్టుకి ప్రత్యేక పూజలు చేశాడని చెబుతారు. అందుకే ఇది యుద్ధం, విజయంతో ముడిపడి ఉంది. నేటికీ దక్షిణ భారతదేశంలో దసరా రోజున ప్రజలు జమ్మి చెట్టుకింద కింద పూజలు చేస్తారు. దానికి నమస్కరిస్తారు.. తాము చేపట్టిన ప్రతి పనిలో విజయం దక్కేలా చూడమని ఆశీస్సులు కోరుకుంటారు.

దసరా అనేది చెడుపై మంచి సాధించిన విజయాన్ని జరుపుకునే పండుగ మాత్రమే కాదు.. శక్తి ,శ్రేయస్సును కోరుకునే సందర్భం కూడా. ఈ రోజున జమ్మి చెట్టుని పూజించడం వల్ల శత్రువులపై విజయం, శని దోషం నుంచి ఉపశమనం, సంపద ప్రాప్తి లభిస్తాయి. అందుకే దసరా నాడు జమ్మి చెట్టుని పూజించడం శుభప్రదమైనది, ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *