
సాధారణంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ రేంజ్‌లో ఉన్నవారు తమ వారసుల్ని నటీనటులుగానే పరిచయం చేయాలనుకుంటారు. అయితే, ప్రస్తుతం కొందరు అగ్ర తారలు ఈ సంప్రదాయాన్ని బ్రేక్ చేస్తున్నారు. వారి వారసులు దర్శకులుగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇది భారతీయ సినీ పరిశ్రమలో ఒక కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కుటుంబం నుంచి కొత్త తరం సిల్వర్ స్క్రీన్‌పైకి వస్తోంది. సూర్య కుమార్తె దియా సూర్య ఒక డాక్యుమెంటరీని రూపొందించారు. అమ్మానాన్నలిద్దరూ నటులైనప్పటికీ, దియా మాత్రం దర్శకురాలిగా తన తొలి ప్రయత్నం చేశారు. అంతేకాదు, ఆమె తన మొదటి ప్రాజెక్ట్‌తోనే ఆస్కార్‌ను లక్ష్యంగా చేసుకుంటున్నారు.