హైదరాబాద్ మెట్రో రైల్ నిర్వహణ బాధ్యతలను తెలంగాణ ప్రభుత్వం స్వీకరించింది. హైదరాబాద్ మెట్రో రైల్ నిర్వహణ నుంచి ఎల్ అండ్ టీ తప్పుకోవడంతో, ఆ సంస్థకున్న ₹13,000 కోట్ల అప్పును ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తోంది. ఇందులో భాగంగా ఎల్ అండ్ టీకి ప్రాథమికంగా ₹2,000 కోట్లను ప్రభుత్వం చెల్లించనుంది. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో ₹22,000 కోట్లతో నిర్మించిన హైదరాబాద్ మెట్రో మొదటి దశ ప్రస్తుతం 69 కిలోమీటర్ల మేర సేవలు అందిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఫేజ్ 2A, 2B కింద 163 కిలోమీటర్ల మేర కొత్త మెట్రో లైన్ల ప్రతిపాదించింది. అయితే, ఫేజ్ 2 ఆమోదం కోసం ఎల్ అండ్ టీతో ఒక డెఫినిటివ్ అగ్రిమెంట్ చేయాలని కేంద్రం కోరింది. ఫేజ్ 2 లో ఈక్విటీ భాగస్వామిగా పాల్గొనలేమని ఎల్ అండ్ టీ స్పష్టం చేసింది. తమ ఈక్విటీ వాటాను రాష్ట్రం లేదా కేంద్రం కొనుగోలు చేయవచ్చని సూచించింది. దీంతో, ఫేజ్ వన్ ప్రాజెక్ట్ అప్పు ₹13,000 కోట్లు తాము తీరుస్తామని ప్రభుత్వం అంగీకరించింది. మెట్రో ఫేజ్ 2 విస్తరణ ప్రణాళికల కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫేజ్ వన్ను తన ఆధీనంలోకి తీసుకుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సోషల్ మీడియా అనుచిత పోస్టుల పెట్టినవారిపై కఠిన చర్యలు
Donald Trump: భారత కంపెనీలపై పగబట్టిన ట్రంప్
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులకు CM రేవంత్ రెడ్డి సూచనలు
టాలీవుడ్ లో అగ్రనటుల మధ్య మొదలైన చిన్నపాటి యుద్ధం
నీ అభిమానం బంగారం కాను.. గోల్డ్ మొబైల్ కవర్ పై బంగారంతో కోహ్లీ ఫొటో