తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు తాజాగా అభ్యర్థుల వివరాలను చేసింది. అభ్యర్థుల నుంచి అభ్యంతరాల స్వీకరణకు ఫిబ్రవరి 28 వరకు గడువు నిర్ణయించింది.
అభ్యంతరాల పరిశీలన అనంతరం మెరిట్ లిస్ట్ విడుదల చేయనున్నట్లు బోర్డు ప్రకటించింది. ఈ క్రమంలో మార్చి చివరి నాటికి ఉద్యోగాల్లో కొత్త అసిస్టెంట్ ప్రొఫెసర్లు చేరనున్నారు.