వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం, తెలంగాణలోని అనేక జిల్లాలకు భారీ వర్ష సూచన ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం సెప్టెంబర్ 27 నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని, అది ఒడిశా తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో సోమవారం, మంగళవారం నాడు ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయబడింది. వర్షంతో పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
మరిన్ని వీడియోల కోసం :