వచ్చేది శీతాకాలం.. ఇప్పటికే వర్షాలు, వరదలతో జనం నానా అవస్థలు పడుతున్నారు. కలుషిత నీరు, దోమల కారణంగా పిల్లలు సహా పెద్దలు కూడా చాలా అనారోగ్యం బారినపడుతున్నారు. ఇలాంటి సమయాల్లో మన రోగనిరోధక శక్తికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే శరీరం బలంగా ఉంటే, వైరస్లు కూడా పెద్దగా ప్రభావం చూపవు. ఆయుర్వేదం దీనికి సరళమైన, ప్రభావవంతమైన నివారణను అందిస్తుంది. అది తిప్పతీగ. ఇది శరీరాన్ని లోపలి నుండి బలపరిచే ఒక మూలిక. దాని కషాయాన్ని ఎలా తయారు చేయాలో, ప్రతిరోజూ దానిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.
మన రోగనిరోధక శక్తి లేదా వ్యాధులతో పోరాడే సామర్థ్యం బలహీనంగా ఉంటే, వైరస్లు త్వరగా వ్యాపిస్తాయి. బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారు తరచుగా అనారోగ్యానికి గురవుతారు. నెమ్మదిగా కోలుకుంటారు. అందువల్ల రోగనిరోధక శక్తిని పెంచే చర్యలతో మీ రోజును ప్రారంభించడం ముఖ్యం. అలాంటి వారికి తిప్పతీగ కషాయం దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఆయుర్వేదంలో గిలోయ్‌ను అమృత అని పిలుస్తారు. దీని అర్థం అమరత్వాన్ని ఇచ్చేది.
చూసేందుకు ఇదేదో పిచ్చి మొక్కలా ఎక్కడపడితే అక్కడ విరివిగా పెరుగుతూ ఉంటుంది. చాలా ఇళ్లలో కనిపించే తీగ లాంటి మొక్క. ఇది యాంటీఆక్సిడెంట్, యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. తిప్పతీగ కషాయంతో శరీరం లోపలి నుండి విషాన్ని తొలగిస్తుంది. వైరస్‌లకు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.
ఇవి కూడా చదవండి
4-5 అంగుళాల తిప్పతీగ కాండం తీసుకోండి. దానికి 4-5 తులసి ఆకులు, కొంచెం అల్లం, ఒకటి లేదా రెండు నల్ల మిరియాలు తీసుకోవాలి. రెండు గ్లాసుల నీటిలో వేసి మరిగించాలి. నీరు సగానికి తగ్గిన తర్వాత దానిని వడకట్టండి. గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగండి. ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో తాగడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
తిప్పతీగ కషాయంతో ప్రయోజనాలు:
తిప్పతీగ రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శరీరంలో మంటను తగ్గిస్తుంది. తరచుగా వచ్చే జలుబు, దగ్గు నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. ఇది రోజువారీ ఆరోగ్య టానిక్‌గా పనిచేస్తుంది. అయితే, ఈ కషాయం పూర్తిగా సహజమైనది. కానీ కొంతమంది జాగ్రత్తగా ఉండాలి. గర్భిణీలు, ఏదైనా మందులు వాడుతున్న వారు వైద్యుడిని సంప్రదించిన తరువాత మాత్రమే వాడాలి. ఎక్కువగా తాగకండి, రోజుకు ఒకసారి తాగితే సరిపోతుంది. వేడి స్వభావం ఉన్నవారు అల్లం, నల్ల మిరియాలను తక్కువ పరిమాణంలో వేసుకోవాలి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.